- ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ..
- శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
Nara Lokesh Fulfills Promise: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ యువగళంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శెట్టిబలిజ సమాజ అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రజా ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. ఏటా మార్చి 23న దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. కోనసీమ ప్రాంతానికి చెందిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి సమాజంలో విద్య ప్రాముఖ్యతను పెంచారు. 19వ శతాబ్దం తొలినాళ్లలోనే సమాజం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు.