Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!!

Kollu Ravindra: ఎక్సైజ్ కానిస్టేబుల్‌ మృతిపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి!

Kollu Ravindra: అమరావతి: విశాఖ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతమ్మధార ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎల్.ఎస్. నాయుడు విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది.

Published : 2026-04-24 16:01:00

కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ..

తక్షణ సాయంగా ఎక్సైజ్ శాఖ నుండి రూ.10 లక్షలు..

అమరావతి: విశాఖ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతమ్మధార ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎల్.ఎస్. నాయుడు విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది.

ఈ ఘటనపై స్పందించిన మంత్రి, మృతుని కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబం ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

తక్షణ సాయంగా ఎక్సైజ్ శాఖ నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదనంగా ఎస్బీఐ ఇన్సూరెన్స్ ద్వారా రూ.1.10 కోట్ల జీవన బీమా సదుపాయం కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, మృతుని కుటుంబంలో అర్హులైన వ్యక్తికి కారుణ్య నియామకం కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై సానుభూతి వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వ తరఫున బాధిత కుటుంబానికి అన్ని విధాల సహకారం అందుతుందని మరోసారి స్పష్టం చేశారు.

Spotlight

Read More →