Kollu Ravindra: ఏపీలో మరో బంగారు గని... 20 ఏళ్ల తర్వాత గనుల పునరుద్ధరణ... మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన! Amit Shah: డ్రోన్లు, రాడార్లతో హైటెక్ సరిహద్దు భద్రతకు కేంద్రం శ్రీకారం! Kollu Ravindra: జొన్నగిరి గోల్డ్ మైన్స్ పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర! Nara Lokesh: మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్.. రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే.! RajyaSabha Elections2026: కేంద్రంలో పెరగనున్న ఏపీ గళం.. కూటమి ఖాతాకే నాలుగు రాజ్యసభ స్థానాలు! Vision 2028: ఏపీ 'విజన్ 2028'... రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు.. 21 లక్షల ఉద్యోగాలే లక్ష్యం! Nara Lokesh: జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్.. AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... ఇకపై అసైన్డ్ ఇంటి స్థలాలను దర్జాగా అమ్ముకోవచ్చు! Water Metro Services: ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. హారన్ల గోల లేదు! నీటిపై తేలుతూ మెట్రో ప్రయాణం... ఏ ఏ నగరాల్లోనో అంటే.. Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... సచివాలయానికి సీఎం: అధికారులతో వరుస భేటీలు! Kollu Ravindra: ఏపీలో మరో బంగారు గని... 20 ఏళ్ల తర్వాత గనుల పునరుద్ధరణ... మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన! Amit Shah: డ్రోన్లు, రాడార్లతో హైటెక్ సరిహద్దు భద్రతకు కేంద్రం శ్రీకారం! Kollu Ravindra: జొన్నగిరి గోల్డ్ మైన్స్ పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర! Nara Lokesh: మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్.. రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే.! RajyaSabha Elections2026: కేంద్రంలో పెరగనున్న ఏపీ గళం.. కూటమి ఖాతాకే నాలుగు రాజ్యసభ స్థానాలు! Vision 2028: ఏపీ 'విజన్ 2028'... రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు.. 21 లక్షల ఉద్యోగాలే లక్ష్యం! Nara Lokesh: జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్.. AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... ఇకపై అసైన్డ్ ఇంటి స్థలాలను దర్జాగా అమ్ముకోవచ్చు! Water Metro Services: ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. హారన్ల గోల లేదు! నీటిపై తేలుతూ మెట్రో ప్రయాణం... ఏ ఏ నగరాల్లోనో అంటే.. Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... సచివాలయానికి సీఎం: అధికారులతో వరుస భేటీలు!

Kollu Ravindra: ఏపీలో మరో బంగారు గని... 20 ఏళ్ల తర్వాత గనుల పునరుద్ధరణ... మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన!

Kollu Ravindra: ఏపీ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కర్నూలు జిల్లా జొన్నగిరి పర్యటనలో భాగంగా వచ్చే నెల జూన్ 27న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా రామగిరిలో కూడా 20 ఏళ్ల క్రితం మూతపడిన గోల్డ్ మైన్స్‌ను గుర్తించామని, అక్కడ కూడా త్వరలోనే బంగారు ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

Published : 2026-05-22 19:00:00

Politics- అనంతపురం జిల్లా రామగిరిలో బంగారు నిక్షేపాలు..

మళ్లీ తెరపైకి రామగిరి గోల్డ్ మైన్స్.. 20 ఏళ్ల తర్వాత గనుల పునరుద్ధరణకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

మైనింగ్ శాఖలో రూ.4,000 కోట్ల అదనపు రాబడి.. గత సర్కార్ కంటే కూటమి పాలనలోనే మెరుగ్గా ఆదాయం!

Kollu Ravindra: భారతదేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా గుర్తింపు పొందిన కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్ త్వరలోనే ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల జూన్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక మైనింగ్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం నాడు జొన్నగిరి ప్రాంతంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కేవలం కర్నూలు జిల్లాలోనే కాకుండా, అనంతపురం జిల్లాలో కూడా భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని సంచలన ప్రకటన చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని ఆయన వెల్లడించారు. జొన్నగిరి తరహాలోనే రామగిరిలో కూడా త్వరలోనే బంగారు వెలికితీత, ఉత్పత్తి రంగాన్ని పునరుద్ధరించి వాణిజ్యపరమైన కార్యకలాపాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.

రామగిరి ప్రాంతానికి దశాబ్దాల కాలం నాటి మైనింగ్ చరిత్ర ఉంది. గతంలో 1984వ సంవత్సరంలో 'భారత్ గోల్డ్ మైన్' అనే ప్రభుత్వ రంగ సంస్థ ఇక్కడ అధికారికంగా తవ్వకాలను ప్రారంభించింది. అప్పట్లో ఏడాదికి సుమారు 124 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలనే భారీ లక్ష్యంతో పనులు నడిచాయి. అయితే వివిధ సాంకేతిక, ఆర్థిక కారణాల వల్ల 2001వ సంవత్సరంలో, అంటే సుమారు 20 ఏళ్ల క్రితమే ఈ రామగిరి గనులను పూర్తిగా మూసివేశారు. ఆ తర్వాత వచ్చిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గనుల పునరుద్ధరణ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవి కేవలం టెండర్లు మరియు ప్రాథమిక ప్రక్రియలకే పరిమితమై అడుగులు ముందుకు పడలేదు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి ఉన్న విపరీతమైన డిమాండ్, అలాగే ఇతర దేశాల నుండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పంతో మళ్లీ ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో కేవలం రామగిరి మాత్రమే కాకుండా, రొద్దం మండలంలోని బొక్కసంపల్లి, కదిరి మండలంలోని జౌకుల వంటి ప్రాంతాలలో కూడా విలువైన గోల్డ్ ఫీల్డ్ బ్లాకులు ఉన్నట్లు మైనింగ్ రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతాల్లోని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మైనింగ్ రంగం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అద్భుతమైన పురోగతిని సాధించిందని మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా గర్వంగా ప్రకటించారు. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ద్వారా ఏకంగా రూ. 4,000 కోట్ల మేర అదనపు రాబడి వచ్చిందని గణాంకాలతో వివరించారు. జొన్నగిరిలో 'జియో మైసూర్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్' సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బంగారు శుద్ధి పనులను చేపట్టనుందని, ప్రస్తుతం అక్కడ 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయని, భవిష్యత్తులో భూగర్భంలో దాదాపు 2 కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపి భారీగా ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు.

Spotlight

Read More →