Kollu Ravindra: ఏపీలో మరో బంగారు గని... 20 ఏళ్ల తర్వాత గనుల పునరుద్ధరణ... మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన! Amit Shah: డ్రోన్లు, రాడార్లతో హైటెక్ సరిహద్దు భద్రతకు కేంద్రం శ్రీకారం! Kollu Ravindra: జొన్నగిరి గోల్డ్ మైన్స్ పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర! Nara Lokesh: మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్.. రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే.! RajyaSabha Elections2026: కేంద్రంలో పెరగనున్న ఏపీ గళం.. కూటమి ఖాతాకే నాలుగు రాజ్యసభ స్థానాలు! Vision 2028: ఏపీ 'విజన్ 2028'... రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు.. 21 లక్షల ఉద్యోగాలే లక్ష్యం! Nara Lokesh: జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్.. AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... ఇకపై అసైన్డ్ ఇంటి స్థలాలను దర్జాగా అమ్ముకోవచ్చు! Water Metro Services: ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. హారన్ల గోల లేదు! నీటిపై తేలుతూ మెట్రో ప్రయాణం... ఏ ఏ నగరాల్లోనో అంటే.. Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... సచివాలయానికి సీఎం: అధికారులతో వరుస భేటీలు! Kollu Ravindra: ఏపీలో మరో బంగారు గని... 20 ఏళ్ల తర్వాత గనుల పునరుద్ధరణ... మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన! Amit Shah: డ్రోన్లు, రాడార్లతో హైటెక్ సరిహద్దు భద్రతకు కేంద్రం శ్రీకారం! Kollu Ravindra: జొన్నగిరి గోల్డ్ మైన్స్ పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర! Nara Lokesh: మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్.. రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే.! RajyaSabha Elections2026: కేంద్రంలో పెరగనున్న ఏపీ గళం.. కూటమి ఖాతాకే నాలుగు రాజ్యసభ స్థానాలు! Vision 2028: ఏపీ 'విజన్ 2028'... రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు.. 21 లక్షల ఉద్యోగాలే లక్ష్యం! Nara Lokesh: జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్.. AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... ఇకపై అసైన్డ్ ఇంటి స్థలాలను దర్జాగా అమ్ముకోవచ్చు! Water Metro Services: ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. హారన్ల గోల లేదు! నీటిపై తేలుతూ మెట్రో ప్రయాణం... ఏ ఏ నగరాల్లోనో అంటే.. Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... సచివాలయానికి సీఎం: అధికారులతో వరుస భేటీలు!

Vision 2028: ఏపీ 'విజన్ 2028'... రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు.. 21 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!

Vision 2028: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా 'ఏపీ విజన్ 2028' ప్రణాళికను ప్రకటించారు. గత 23 నెలల కాలంలోనే ఏపీ రాష్ట్రం ఏకంగా రూ.21.64 లక్షల కోట్ల విలువైన 756 భారీ ప్రాజెక్టులను ఆకర్షించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 21.20 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Published : 2026-05-22 13:15:00

Politics- ఏపీకి క్యూ కట్టిన పరిశ్రమలు.. 23 నెలల్లో రూ.21.64 లక్షల కోట్ల పెట్టుబడులు!

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. 

రాబోయే రోజుల్లో 21.20 లక్షల ఉద్యోగాల సృష్టి!

Vision 2028: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే కాకుండా, రాష్ట్ర యువతకు రికార్డు స్థాయిలో ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వేగంగా అమలు కావాలని, ప్రభుత్వ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం స్పష్టంగా కనిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే 2028 నాటికి ఏపీ ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చేలా 'విజన్ 2028' ప్రణాళికను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది.

ఈ సమీక్షా సమావేశంలో ఉపాధి కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ చైర్మన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వివరాలను వెల్లడించారు. గత 23 నెలల స్వల్ప కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో ఏకంగా రూ.21,64,258 కోట్ల విలువైన మొత్తం 756 భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 21,20,567 ఉద్యోగావకాశాలు సృష్టించబడనున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. దేశంలోనే కాకుండా ప్రైవేటు రంగ పెట్టుబడుల సాధనలో ఏపీ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదించిన ప్రాజెక్టులన్నీ రాబోయే సెప్టెంబర్ నెల నాటికి ఖచ్చితంగా భూమి పూజ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించాలని స్పష్టమైన గడువు విధించారు. అంతేకాకుండా, విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన అన్ని ఒప్పందాలు డిసెంబర్ 2028 నాటికి పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల అనుమతులు, భూసేకరణ మరియు ఉపాధి కల్పన సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఒకే ఒక్క సమగ్ర ఆన్‌లైన్ డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని, ఎంఎస్ఎంఈల అనుమతుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ తీసుకురావాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక, ఐటీ రంగాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం భారీ పీఠం వేస్తోంది. ఇందులో భాగంగానే పర్యాటక రంగానికి భూ కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో 'గోవా ప్లస్' పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని 21 ప్రధాన పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను వేగవంతం చేయాలని, ఏవియేషన్ (విమానయాన రంగం), నౌకా నిర్మాణం, సెమీకండక్టర్ల తయారీ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో వినూత్న ప్రాజెక్టులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే, రాష్ట్రం నిర్దేశించుకున్న 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు సోలార్ రూఫ్‌టాప్ మరియు విండ్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రస్తుతం బీపీసీఎల్, ఇండోసోల్, శ్రీసిటీ ఫేజ్-2 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూసేకరణ శరవేగంగా జరుగుతోందని, ముఖ్యంగా బీపీసీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన 3,000 ఎకరాలలో 2,000 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి కావడం ప్రభుత్వ వేగానికి నిదర్శనమని అధికారులు వెల్లడించారు. భారీ పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాల సృష్టి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను రాబోయే రోజుల్లో దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Spotlight

Read More →