అమరావతిలో నిర్వహించిన ఆవకాయ–అమరావతి (Avakaya-Amaravathi Festival)ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో ఆవకాయ ప్రత్యేక స్థానం ఉందని ఆవకాయ అంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందన్నారు. ఇటువంటి సంప్రదాయబద్ధమైన ఉత్సవాలను ప్రతి ఏడాది జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా 28 ఈవెంట్లు, నాలుగు వర్క్‌షాపులు ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ప్రపంచానికి అతిథ్యం ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదగాలని తన ఆకాంక్షగా తెలిపారు. (Avakaya Festival Vijayavada) గత ఐదేళ్లుగా ఇలాంటి ఉత్సవాలు జరగకపోవడం వల్ల ప్రజల్లో ఆనందం తగ్గిపోయిందని, ఇప్పుడు మళ్లీ పండుగ వాతావరణం నెలకొనడం సంతోషంగా ఉందన్నారు.
ఒకప్పుడు దసరా అంటే మైసూరు, కలకత్తా గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు (AndhraPradesh) విజయవాడ దసరా ఉత్సవాల వల్ల దేశమంతా విజయవాడ వైపు చూస్తుందని చెప్పారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పిలుపునిచ్చారు. తన జీవితంలో భగవంతుడు రెండు అవకాశాలు ఇచ్చాడని, సీఎంగా ఉండగా మూడు పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
బ్రిటీష్ పాలనలో నిర్మించిన ఆనకట్టల వల్ల ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులను గుర్తు చేశారు.( Cm ChandrababuNaidu) ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఇంట్లో పిల్లలను ఐటీ చదివించాలని చెప్పానని, అప్పుడు చదువుకున్న వారే నేడు ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు ప్రజలు ఉన్నారని, వ్యాపారాల్లో ముందుండేది కృష్ణా జిల్లా వారేనని అన్నారు.
సినిమా రంగం క్రియేటివిటీకి చిరునామాగా మారిందని భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు ఎన్నో ప్రయోగాలు తెలుగు సినిమా చేసింది అని గుర్తు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్‌బాబు వంటి గొప్ప నటులు ఇదే జిల్లాకు చెందినవారని, నేటికీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి వారు నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని తెలిపారు. కోహినూర్ వజ్రం కూడా ఈ ప్రాంతం నుంచే నిజాం వద్దకు వెళ్లిందని ఉదాహరణగా చెప్పారు.
భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా ఇంట్లోనే గ్యాస్ తయారు చేసుకునే రోజులు వస్తాయని, విశాఖను ఏఐ హబ్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతి ఒక బెస్ట్ సిటీ, డైనమిక్ సిటీగా ఎదుగుతుందని అన్నారు. కృష్ణా నది ఒడ్డున గంట సేపు గడిపితే మెడిటేషన్ అవసరం లేదన్నంత ప్రశాంతత ఉంటుందని వ్యాఖ్యానించారు.
అమరావతిని గ్రీన్ సిటీగా, (Vijayawada) విజయవాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, భద్రత ఉంటేనే పర్యాటకులు వస్తారని చెప్పారు. ఆవకాయ–అమరావతి ఉత్సవాలు నగరాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిగా మారాలని ఆకాంక్షించారు.
అమరావతి (capitalcity) దేవతల రాజధాని అని పేర్కొన్న సీఎం, అరకు కాఫీ ఇప్పటికే ప్రపంచ స్థాయికి చేరిందని, కేజీ ధర పది వేల వరకు పలుకుతోందని తెలిపారు. టెంపుల్ టూరిజంలో మన రాష్ట్రాన్ని ఎవరు మించలేరని ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన రాష్ట్రంలో ఉండటం అదృష్టమని, ఆ దీవెనలతో అమరావతి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. చివరగా అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సీఎం కోరుకున్నారు