Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల!

AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!!

AP Govt Schemes: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పరిమితి వల్ల ప్రభుత్వం అమలు చేసే పలు సంక్షేమ పథకాలు (ఉదాహరణకు అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు) అందడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు.

Published : 2026-02-25 13:40:00

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు…

సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో హామీ…

అసెంబ్లీలో సర్కారు కీలక ప్రకటన…

AP Govt Schemes: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయా లేదా అన్న అంశంపై సభలో వాడివేడి చర్చ జరిగింది. గత కొంతకాలంగా పథకాల కోతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగుల పరిస్థితిని సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనలను సభకు వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, అయితే ఆదాయ పరిమితులు కచ్చితంగా
పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి అసెంబ్లీలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ఉన్న ఆదాయ పరిమితి నిబంధనలే వీరికి కూడా వర్తిస్తాయని మంత్రి తెలిపారు. చాలీచాలని జీతాలతో బతుకుతున్నామని, కనీసం పథకాలైనా అందేలా చూడాలని కోరుతున్న ఉద్యోగులకు ఈ ప్రకటన మింగుడుపడటం లేదు. జీతం పది వేలు దాటిన వెంటనే రేషన్ కార్డులు, అమ్మఒడి వంటి పథకాలకు వారు అనర్హులుగా మారుతున్నారని సభలో చర్చ జరిగింది.

ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆదాయ పరిమితులను మంత్రి క్షుణ్ణంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఏడాదికి రూ.1.20 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు ఏడాదికి రూ.1.44 లక్షల లోపు ఆదాయం కలిగి ఉంటేనే పథకాలకు అర్హత లభిస్తుంది. ఈ లెక్కన నెలకు సగటున 10 నుంచి 12 వేల రూపాయల లోపు జీతం తీసుకునే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వ లబ్ధిని పొందగలరు. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా వారు అనర్హుల జాబితాలోకి వెళ్తారని మంత్రి తేల్చి చెప్పారు. ఇది ప్రభుత్వ పాత నిబంధనే అయినప్పటికీ, ప్రస్తుతం దీని అమలుపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వ తాజా ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ ఆదాయ పరిమితి చాలా తక్కువని, దీనిని కనీసం నెలకు 20 వేల రూపాయల వరకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెబుతోంది. అర్హత ఉన్న వారికి అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చినప్పటికీ, మెజారిటీ ఉద్యోగులు ఈ ఆదాయ పరిమితి వల్ల పథకాలకు దూరం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనిపై ముందు ముందు ప్రభుత్వం ఇంకా ఏవైనా రాయితీలు ఇస్తుందో లేదో వేచి చూడాలి.
 

Spotlight

Read More →