Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్!

AP Tourism Policy 2024-29: ఏపీ పర్యాటక రంగానికి మహర్దశ.. విశాఖ, తిరుపతిలో వండర్ లా ప్రాజెక్టులపై మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన..!!

AP Tourism Policy 2024-29: ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కులు, డిస్నీ వరల్డ్ వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త పర్యాటక విధానం ద్వారా ఇన్వెస్టర్లకు ఇచ్చే రాయితీలు విశాఖ, తిరుపతిలో రాబోయే ప్రాజెక్టుల పూర్తి వివరాలు

Published : 2026-03-06 11:30:00

AP Tourism Policy 2024-29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి వినోద సౌకర్యాలు, భారీ థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలో డిస్నీ వరల్డ్ తరహా ప్రాజెక్టును తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీని కోసం 171 ఎకరాల భూమిని సిద్ధం చేయగా, ఇన్వెస్టర్లు ముందుకు వస్తే అన్ని రకాల సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

డిస్నీ వరల్డ్ లేదా యూనివర్సల్ స్టూడియోస్ వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించాలంటే సుమారు రూ. 35,000 కోట్ల నుంచి రూ. 60,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని మంత్రి వివరించారు. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా ఖర్చు చేయలేదని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పార్కులను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున భూమి కేటాయింపులు, వేగంగా అనుమతులు మంజూరు చేయడం  రాయితీలు ఇవ్వడం వంటి పనులు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో పర్యాటకుల ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోందని, భవిష్యత్తులో మన దగ్గర కూడా ఇలాంటి పార్కులు ఖచ్చితంగా వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

మన దేశంలో ఇప్పటికే పేరుగాంచిన 'ఇమాజికా', 'వండర్ లా' వంటి సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ సంస్థలు తిరుపతి  విశాఖపట్నంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ ఏకంగా రూ. 18,448 కోట్ల విలువైన 102 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో మూడు ప్రధానమైన థీమ్ పార్కులు ఉండటం విశేషం. పర్యాటక రంగానికి 'పారిశ్రామిక హోదా' కల్పించడం వల్ల పెట్టుబడిదారులు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కొత్త పర్యాటక విధానం ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్లు ప్రకటించింది.

పెట్టుబడి సబ్సిడీ: 5 నుండి 10 శాతం వరకు లేదా రూ. 40 కోట్ల వరకు సబ్సిడీ.

ఫీజుల మినహాయింపు: 100 శాతం స్టాంపు డ్యూటీ రీయింబర్స్‌మెంట్ భూ వినియోగ మార్పిడి ఫీజు రద్దు.

 విద్యుత్ & పన్నులు: పారిశ్రామిక టారిఫ్ ప్రకారం కరెంటు ఛార్జీలు, 7-15 ఏళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్.

ఉపాధి ప్రోత్సాహకాలు: ఈఎస్ఐ, ఈపీఎఫ్ లలో రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ వేదికలైన లండన్, బెర్లిన్, దుబాయ్ వంటి నగరాల్లో జరిగిన రోడ్ షోలలో ఏపీ పర్యాటక శాఖ పాల్గొని మన రాష్ట్ర విశిష్టతను చాటిచెప్పింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కర్నూతలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ పునరుద్ఘాటించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉపాధి దొరకడమే కాకుండా, విదేశీ పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Spotlight

Read More →