Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా!

AP Revenue Meetings Updates: భూ రికార్డుల తప్పులను సరిదిద్దుతాం.. సామాన్యుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి అనగాని హామీ!

AP Revenue Meetings Updates: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు. భూ రికార్డుల తప్పులు, గత ప్రభుత్వ వైఫల్యాలు మరియు సీఎం చంద్రబాబు సమీక్షల గురించి మంత్రి మాట్లాడారు.

Published : 2026-02-13 12:12:00

AP Revenue Meetings Updates: భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి వర్క్‌షాపులు

రైతులకు భరోసా… పారదర్శక పాలన అందిస్తాం

భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వేగం పెంచింది

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి మంచి స్థాయిలో స్పందన వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు. ( Mantri anagani) ఈ సదస్సుల్లో భూములకు సంబంధించిన సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారని (AP Revenue Meetings Updates) ఆయన పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రభుత్వం ఈ ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకుని పరిష్కరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 2,34,665 వినతిపత్రాలు అందాయని మంత్రి వివరించారు. ప్రభుత్వం వీటిపై వేగంగా స్పందించి ఇప్పటికే 2,33,578 దరఖాస్తులను పరిష్కరించిందని ఆయన తెలిపారు. అంటే వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు అన్నింటినీ అధికారులు క్లియర్ చేశారని చెప్పారు. వీటిలో కేవలం 659 దరఖాస్తులు మాత్రమే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించినవని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో భూ రికార్డులు తారుమారయ్యాయని మంత్రి అనగాని విమర్శించారు.

ఆ సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) కు వస్తున్న ఫిర్యాదుల్లో ఏకంగా 61 శాతం ఫిర్యాదులు ఒక్క రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. అందుకే భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. ప్రతి నెలా ఒకసారి ముఖ్యమంత్రి స్వయంగా రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తూ, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజలు తమ భూముల విషయంలో ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. పారదర్శకమైన పాలన అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Spotlight

Read More →