Telangana: మిషన్ మోడ్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి! AP Students: విద్యార్థులకు బంపర్ ఆఫర్: ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు.. ఈ నెల 22 వరకే ఛాన్స్! Ramprasad Reddy: ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు.. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి.. Central Govt: కేంద్ర రాజకీయాల్లో మార్పుల సంకేతాలు.. బీజేపీ, కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం! LPG Gas Subsidy: వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్... పాన్ కార్డు డేటా ఆధారంగా..! TamilNadu: తమిళనాడులో విజయ్ సంచలన నిర్ణయం... 717 మద్యం దుకాణాలు బంద్! Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. అన్నాడీఎంకేలో చీలిక! విజయ్‌కు మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు! Chandrababu: భయం వద్దు.. పెట్టుబడులతో రండి- చంద్రబాబు! Nara Lokesh: నారా లోకేష్ సరికొత్త రూపం: సింగపూర్ లో సూట్ లో దర్శనం! Polavaram Project: ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం... 2027 జూన్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్! Telangana: మిషన్ మోడ్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి! AP Students: విద్యార్థులకు బంపర్ ఆఫర్: ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు.. ఈ నెల 22 వరకే ఛాన్స్! Ramprasad Reddy: ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు.. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి.. Central Govt: కేంద్ర రాజకీయాల్లో మార్పుల సంకేతాలు.. బీజేపీ, కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం! LPG Gas Subsidy: వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్... పాన్ కార్డు డేటా ఆధారంగా..! TamilNadu: తమిళనాడులో విజయ్ సంచలన నిర్ణయం... 717 మద్యం దుకాణాలు బంద్! Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. అన్నాడీఎంకేలో చీలిక! విజయ్‌కు మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు! Chandrababu: భయం వద్దు.. పెట్టుబడులతో రండి- చంద్రబాబు! Nara Lokesh: నారా లోకేష్ సరికొత్త రూపం: సింగపూర్ లో సూట్ లో దర్శనం! Polavaram Project: ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం... 2027 జూన్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్!

Telangana: మిషన్ మోడ్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి!

Telangana: తెలంగాణలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

Published : 2026-05-12 14:43:00

కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు..

రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలి..

తెలంగాణలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.

మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ధాన్యం సేకరణ పురోగతి, మొక్కజొన్న కొనుగోళ్ల పరిస్థితిపై సమీక్ష చేశారు. జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికీ వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు.

కొన్ని ప్రాంతాల్లో గోదాముల కొరత ఉన్నట్లు గుర్తించామని, అలాంటి చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్ వంటి ప్రదేశాలను వినియోగించి ధాన్యాన్ని భద్రపరచాలని చెప్పారు. అక్కడి నుంచి దశలవారీగా గోదాములకు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

మొక్కజొన్న పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే పోలీసుల సహకారంతో కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చెప్పారు. ప్రతి జిల్లా కలెక్టర్ ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికలు పంపాలని ఆదేశించారు.

అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులకు వెంటనే చేరవేసేలా మండల స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రైతులను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు.

ప్రతి ఐకేపీ కేంద్రం వద్ద ఒక అధికారిని నియమించి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి రైస్ మిల్లు వద్ద కూడా బాధ్యతాయుతమైన అధికారిని ఉంచి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందించాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో జరిగే అక్రమాలను అరికట్టవచ్చని చెప్పారు.

లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కలెక్టర్లు నేరుగా పర్యవేక్షిస్తేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు కూడా తెలంగాణ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. అలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Spotlight

Read More →