AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!

Visakhapatnam: విశాఖ భవిష్యత్తుకు బ్లూప్రింట్: VMRDA తుది మాస్టర్ ప్లాన్‌ను త్వరగా విడుదల చేయాలని మంత్రి నారాయణ ఆదేశం!

Blueprint Visakhapatnam future Minister Narayana: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు..వీలైనంత త్వరగా VMRDA తుది మాస్టర్ ప్లాన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు..

Published : 2026-02-26 22:35:00
  • ప్రజల సూచనలే కీలకం: వచ్చే నెల 10తో ముగియనున్న మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల గడువు..
     
  • వైజాగ్ టు రాంబిల్లి 'సెమీ రింగ్ రోడ్డు': భోగాపురం ప్రయాణాన్ని సులభతరం చేసే భారీ ప్రాజెక్టుపై సమీక్ష..

Blueprint Visakhapatnam future Minister Narayana: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.. వీలైనంత త్వరగా VMRDA తుది మాస్టర్ ప్లాన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.. సచివాలయంలో VMRDA అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేశారు..ఈ సమీక్షకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,డైరెక్టర్ సంపత్ కుమార్, VMRDA కమిషనర్ తేజ్ భరత్,పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత తో పాటు వీఎంఆర్డీఏ
అధికారులు హాజరయ్యారు.

వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై ప్రజల సూచనలు, అభ్యంతరాలు కోరుతూ ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు...వచ్చే నెల 10 వ తేదీకి ఈ గడువు ముగుస్తుంది...వీలైనంత త్వరగా మాస్టర్ ప్లాన్ రూపొందించి త్వరగా ఫైనల్ ప్లాన్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు..మొదటిసారి VMRDA కు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుంది ప్రభుత్వం.. ఖరగ్ పూర్ IIT ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుంది.

ఇక విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(VKPCPIR) మాస్టర్ ప్లాన్ కూడా త్వరగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు...
విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకూ 7 రోడ్లను ప్రాధాన్యత గా చేపడుతున్నారు..వీటీలో ఇప్పటికే కొన్ని రోడ్లకు టెండర్లు పిలిచారు..ఆయా రోడ్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు...భోగాపురం నుంచి అనకాపల్లి జిల్లా రాంబిల్లి వరకూ విశాఖపట్నం సెమీ రింగ్ రోడ్డు పై సమావేశంలో చర్చ జరిగింది.

VMRDA ఆధ్వర్యంలో ప్రైవేట్ - పబ్లిక్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టుల గురించి అధికారులు మంత్రి నారాయణ కు వివరించారు...మొత్తం 6 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపడుతున్నారు..ఆయా ప్రాజెక్టులపై లోతుగా అధ్యయనం చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు..అధారిటీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఇంజినీరింగ్ పనులు,విశాఖ ఎకనామిక్ రీజియన్(VER) పరిధిలో ప్రాజెక్టులు,కైలాసగిరి మాస్టర్ ప్లాన్ పై సమావేశంలో చర్చ జరిగింది..VMRDA చేపట్టే MIG లే అవుట్ ప్రాజెక్టుల కోసం ల్యాండ్ పూలింగ్ పైనా మంత్రి నారాయణ సమావేశంలో చర్చించారు...
 

Spotlight

Read More →