AP Farmers: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు! CM Chandrababu: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఉగాది వేడుకలు..! పాల్గొన్న సీఎం చంద్రబాబు! Amaravati E13 Road NH-16: ఇది కదా అసలైన డెవలప్‌మెంట్ అంటే! కొండల మలుపుల మధ్య 50 మీటర్ల వెడల్పుతో రాజధాని బాట! Voter List: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల! AP Government: సదరం కష్టాలకు చెక్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిజిటల్ సంతకంతో ధృవీకరణ పత్రాలు...! Andhra Pradesh: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త.. పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరణ! Ugadi Gift: రైతులకు ఉగాది కానుక! మార్చి 22న మీ ఖాతాల్లోకి డబ్బులు... రెడీగా ఉండండి! AP Government: మార్చి 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే! Tidco Houses: టిడ్కో దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్... డబ్బులు వెనక్కి ఇవ్వాలని సీఎం ఆదేశాలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! AP Farmers: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు! CM Chandrababu: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఉగాది వేడుకలు..! పాల్గొన్న సీఎం చంద్రబాబు! Amaravati E13 Road NH-16: ఇది కదా అసలైన డెవలప్‌మెంట్ అంటే! కొండల మలుపుల మధ్య 50 మీటర్ల వెడల్పుతో రాజధాని బాట! Voter List: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల! AP Government: సదరం కష్టాలకు చెక్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిజిటల్ సంతకంతో ధృవీకరణ పత్రాలు...! Andhra Pradesh: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త.. పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరణ! Ugadi Gift: రైతులకు ఉగాది కానుక! మార్చి 22న మీ ఖాతాల్లోకి డబ్బులు... రెడీగా ఉండండి! AP Government: మార్చి 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే! Tidco Houses: టిడ్కో దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్... డబ్బులు వెనక్కి ఇవ్వాలని సీఎం ఆదేశాలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే!

Andhra Pradesh News: ఏపీ కాంట్రాక్టర్లకు ఉగాది ధమాకా: రూ. 2 వేల కోట్ల బకాయిలు విడుదల!

AP Contractors Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా 50 వేల మంది చిన్న కాంట్రాక్టర్లకు రూ. 2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అలాగే రూ. 55.63 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులను మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Published : 2026-03-19 15:49:00

AP Contractors Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ వేళ రాష్ట్రంలోని చిన్న తరహా కాంట్రాక్టర్లకు తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఏకంగా రూ. 2 వేల కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. పండుగ పూట ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినప్పటికీ, నిధుల కొరత కారణంగా చాలా కాలంగా బిల్లులు ఆగిపోయాయి. ముఖ్యంగా రూ. కోటి లోపు విలువైన పనులు చేసిన వారే ఈ జాబితాలో అధికంగా ఉన్నారు. ఈ సమస్యను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గత రెండు రోజులుగా అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, సాంకేతిక అడ్డంకులను తొలగించి ఈ నిధుల విడుదలకు మార్గం సుగమం చేశారు.

ముఖ్యంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్  అలాగే విపత్తు నిర్వహణ నిధుల కింద పనులు చేసిన వారికి ఈ ప్రాధాన్యత కల్పించారు. ఇవాళే ఆయా కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. కేవలం కాంట్రాక్టర్లకే కాకుండా, సామాన్యులకు కూడా అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి  కింద సుమారు 6,787 మంది బాధితులకు రూ. 55.63 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 1.36 లక్షల మందికి పైగా బాధితులకు దాదాపు రూ. 1,241 కోట్ల మేర వైద్య  ఆర్థిక సహాయాన్ని అందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ 'శ్రీ పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఇంటిలోనూ సుఖశాంతులు వెల్లివిరియాలని, పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, 'స్వర్ణాంధ్ర విజన్ 2047' దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఉగాది పండుగ రోజే ఒకవైపు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడం, మరోవైపు పేదల ఆరోగ్య అవసరాల కోసం నిధులు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇది నిజంగానే పెద్ద పండుగ అని చెప్పవచ్చు.

Spotlight

Read More →