రాజధాని అమరావతి చుట్టూ నిర్మిస్తున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్), విజయవాడ తూర్పు బైపాస్లకు వినియోగించే చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్ ఫీజు తదితరాలను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ మెటీరియల్స్కు వసూలు చేసే జీఎస్టీలో.. రాష్ట్ర జీఎస్టీ (ఎసీఎస్టీ) కేంద్రానికి వెనక్కి ఇచ్చేందుకు వీలు కల్పించారు. ఈ మేరకు రవాణా, ఆర్అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే బుధవారం ఉత్తర్వులిచ్చారు. 189 కి. మీ. మేర ఓఆర్ఆర్, 50 కి. మీ. మేర విజయవాడ తూర్పు బైపాస్ నిర్మించనుండగా వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించే పరిస్థితి లేదని, భూసేకరణ నిధులనూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎఐ), కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రత్యామ్నాయంగా వీటి నిర్మాణంలో వినియోగించే చిన్నతరహా ఖనిజాలైన మట్టి, గ్రావెల్, ఇసుక, కంకర తదితరాలకు సీనరేజ్తోపాటు దానికి అనుబంధంగా ఉండే జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్), ఖనిజాన్వేషణ నిధి (మెరిట్) నుంచి మినహాయింపును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. అలాగే ఈ రెండు రహదారుల నిర్మాణంలో వినియోగించే స్టీల్, సిమెంట్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీనీ మినహాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే రాష్ట్ర జీఎస్టీ మినహాయింపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా మెటిరీయల్పై వసూలు చేసే జీఎస్టీలో రాష్ట్ర జీఎస్టీ వాటా మన ప్రభుత్వానికి వచ్చాక దాన్ని తిరిగి కేంద్రానికి చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: