అమరావతి: విజయవాడ లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ జరగనుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రత్యేకం సందేశం ఇచ్చారు. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది.
అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు అయితే...పెడస్టల్ ఎత్తు 81 అడుగులుగా ఉంది. అంటే మొత్తం 206 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా కనిపించనుంది. 18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటైంది.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలుంటాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు ఉంటాయి బెజవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహా శిల్పం...మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని అన్నారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం అని కొనియాడారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి