Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

AP GENCO Record Production: జెన్కో చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇది సీఎం విజన్, సిబ్బంది కృషి: మంత్రి గొట్టిపాటి రవికుమార్..!

AP GENCO Record Production: ఏపీ జెన్కో చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించింది. రాబోయే వేసవిలో కరెంట్ కోతలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, గత ప్రభుత్వ భారాల నుంచి ప్రజలను రక్షిస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

Published : 2026-03-12 19:38:00

AP GENCO Record Production: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం  చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జెన్కో  తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ ఉత్పత్తిని సాధించి రికార్డు సృష్టించింది. గురువారం నాడు ఏకంగా 6160 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, తన పాత రికార్డులన్నింటినీ చెరిపివేసింది. ఈ అసాధారణ విజయంపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ రికార్డు స్థాయి ఉత్పత్తిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెన్కో అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆయన పేరుపేరునా అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయన ఇచ్చిన సలహాలు ఈ విజయానికి ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు. జెన్కో స్థాపించిన నాటి నుండి ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి కావడం ఇదే తొలిసారి అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా, 5730 మెగావాట్ల ఎక్స్-బస్ సరఫరాను కూడా విజయవంతంగా అందించినట్లు వివరించారు.

రాబోయే ఎండాకాలం దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. "ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో వేసవిలో ఎండలు ముదిరే అవకాశం ఉంది. విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి" అని మంత్రి ఆదేశించారు. ఇళ్లు, వ్యాపారాలు, పరిశ్రమలు.. ఇలా ఏ రంగానికి కూడా కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయడమే తమ ముందున్న టాస్క్ అని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఏపీ జెన్కోను నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు కరెంట్ కొని ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏకంగా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వినియోగదారులపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 పైసల 'ట్రూ డౌన్' అమలు చేసి ప్రజలకు ఊరటనిచ్చామన్నారు. కరెంట్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వందలాది కొత్త సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నామని, కొత్త లైన్లు వేస్తున్నామని తెలిపారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి పెంచడమే కాకుండా, పంపిణీ వ్యవస్థలో లోపాలు లేకుండా చూస్తున్నామని  చెప్పుకొచ్చారు.

Spotlight

Read More →