ఏపీ ఎంపిక చేసిన ఒక ఐటిఐలో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సైమన్ టాన్ అంగీకారం తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన పలు సిఫార్సులకు ఆయన సానుకూలంగా స్పందించారు.
తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సైమన్ టాన్ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ను ప్రకటించామన్నారు.