USA: అభివృద్ధిలో వలసదారుల పాత్ర కీలకం.. భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! USA: అభివృద్ధిలో వలసదారుల పాత్ర కీలకం.. భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..!

Iran Israel War 2026: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వీరమరణం.. ప్రతీకార జ్వాలల్లో పశ్చిమ ఆసియా..శంషాబాద్‌లో విమానాల రద్దు..!!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమైంది. ఇరాన్ కొత్త నాయకుడిగా మొజ్తబా ఖమేనీ నియమితులయ్యారు. యుద్ధ ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 22 విమానాలు రద్దు అయ్యాయి.

Published : 2026-03-01 09:40:00

ప్రతీకారం తీర్చుకుంటాం ఇరాన్ కేబినెట్ హెచ్చరిక

కొత్త వారసుడిగా కుమారుడు.. 

శంషాబాద్‌లో 22 విమానాలు రద్దు.. 

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ధృవీకరించాయి. ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారని, ఒక గొప్ప విప్లవ నాయకుడిని దేశం కోల్పోయిందని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ విషాదం చోటు చేసుకోవడం ఇరాన్ వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఖమేనీ మృతిని ఇరాన్ కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఇదొక 'మహానేరం' అని అభివర్ణించిన ప్రభుత్వం, దీని వెనుక ఉన్న శక్తులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన మొదలైంది. ఖమేనీ మృతికి ప్రతిగా ఇరాన్ నుంచి భారీ దాడులు జరిగే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, ఖమేనీ మరణించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ తదుపరి వారసుడిని ప్రకటించింది. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా నియమించారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాలనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇరాన్ మిలిటరీ శక్తి అయిన ఐఆర్జీసీ  కొత్త చీఫ్‌గా అహ్మద్ వహిదీ బాధ్యతలు చేపట్టారు.ఒకవేళ ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభిస్తే, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సెగ హైదరాబాద్‌కు కూడా తాకింది. గగనతలంలో యుద్ధ విమానాల సంచారం, క్షిపణి దాడుల భయంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశీ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దుబాయ్, మస్కట్, అబుదాబి వంటి నగరాలకు వెళ్లాల్సిన సుమారు 22 విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చక్కబడే వరకు విమానాల రాకపోకలపై అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది

Spotlight

Read More →