Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Tomato Chutney: టమాటో ఉల్లిపాయ 'నల్చిన కారం'..! వంటింట్లో మ్యాజిక్ చేసే సులభమైన వంటకం! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! LPG Cylinder: స్టవ్ మంట ఎరుపు రంగులో వస్తుందా? జాగ్రత్త.. మీ గ్యాస్ వృథా అవుతున్నట్లే! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! LPG Shortage: ముంబయిలో గ్యాస్ మంటలు... సిలిండర్ల కొరతతో 20 శాతం హోటళ్లు బంద్! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Tomato Chutney: టమాటో ఉల్లిపాయ 'నల్చిన కారం'..! వంటింట్లో మ్యాజిక్ చేసే సులభమైన వంటకం! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! LPG Cylinder: స్టవ్ మంట ఎరుపు రంగులో వస్తుందా? జాగ్రత్త.. మీ గ్యాస్ వృథా అవుతున్నట్లే! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! LPG Shortage: ముంబయిలో గ్యాస్ మంటలు... సిలిండర్ల కొరతతో 20 శాతం హోటళ్లు బంద్! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి!

AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

AP Development: కేంద్ర కేబినెట్ జల్‌జీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం ఏపీకి వరంగా మారింది. గతంలో జరిగిన నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ పథకాన్ని కొత్త సంస్కరణలతో (JJM 2.0) అమలు చేయనుంది. దీనివల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందే మార్గం సుగమమైంది.

Published : 2026-03-10 20:17:00

గ్రామీణ తాగునీటి వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు…

జల్‌జీవన్ మిషన్ 2.0'తో ఏపీకి భారీ లబ్ధి…

డిజిటల్ పర్యవేక్షణతో నిధుల దుర్వినియోగానికి ఇక చెక్…

AP Development: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించే ప్రక్రియకు పెద్ద ఊరటనివ్వనుంది. కేంద్ర కేబినెట్ 'జల్‌జీవన్ మిషన్' (Jal Jeevan Mission 2.0) గడువును 2028 వరకు పొడిగిస్తూ, దాదాపు రూ. 8.7 లక్షల కోట్ల భారీ వ్యయంతో ఈ పథకంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా, కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశం ఉంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జల్‌జీవన్ పథకం నిధులు పక్కదారి పట్టాయని, సుమారు రూ. 4,000 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారని కూటమి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. నాటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కేవలం పైపులైన్లు వేసి వదిలేసిందని, స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయలేదని విమర్శలు వచ్చాయి. దీనివల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి, పథకం అమలులో ఏపీ దేశంలోనే వెనుకబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల్‌జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, కేంద్రానికి పలుమార్లు విన్నపాలు చేశారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల ప్రజలకు నీరు అందకుండా పోయిందని, ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని వారు కేంద్ర జలశక్తి మంత్రితో చర్చలు జరిపారు. సుమారు రూ. 70,000 కోట్ల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా, కేంద్రం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది.

కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ విస్తరణ నిర్ణయంతో ఏపీకి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన 'జల్‌జీవన్ మిషన్ 2.0'లో మౌలిక సదుపాయాల కంటే 'సేవలు' (Service Delivery) అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయడం మాత్రమే కాకుండా, ప్రతి రోజూ సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం 'సుజలం భారత్' అనే ప్లాట్‌ఫారమ్‌ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయి.
 

Spotlight

Read More →