భక్తులకు శుభవార్త.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 'అయోధ్య- కాశీ- బైద్యనాథ్ ధామ్ పుణ్యక్షేత్ర' పేరుతో మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో పూరీ- కోణార్క్- గయ వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు కూడా కవర్ అవుతాయి. ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు/ $10$ పగళ్లు సాగుతుంది.
ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ జనవరి 21వ తేదీన సికింద్రాబాద్ నుండి బయలుదేరి వెళ్తుంది. మొత్తం 714 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 237 స్లీపర్ క్లాస్, 425 3ఏసీ, మరియు 52 2ఏసీ సీట్లు ఉన్నాయి.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్కు ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం ఉంది. ఈ స్టేషన్లలో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
యాత్రలో భక్తులు దర్శించుకునే ముఖ్యమైన ప్రదేశాలు.. తొలుత పూరీ జగన్నాథుడిని దర్శించుకుని, ఆ తర్వాత కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించవచ్చు.
ఇక్కడ విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాలతో పాటు కారిడార్ సందర్శనం, సాయంత్రం గంగా హారతిని తిలకించవచ్చు.
చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలు మరియు సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. చివరిగా బైద్యనాథ్ ధామ్ ఆలయ సందర్శనతో ఈ టూర్ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి రైలు మళ్లీ సికింద్రాబాద్కు చేరుకుంటుంది.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, భోజనం మరియు స్థానిక రవాణా కలిపి ఉంటాయి. పెద్దలకు రూ. 16,800, 5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకు రూ. 15,700. పెద్దలకు రూ. 26,300, 5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకు రూ. 24,900. పెద్దలకు రూ. 34,300, 5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకు రూ. 32,700 చెల్లించాల్సి ఉంటుంది.