GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! Microsoft: AI దెబ్బ.. మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్, ఒక్కరోజులో బిలియన్ల నష్టం! Smart Phone: ఇది ఫోన్ కాదు… చేతిలో పట్టుకునే DSLR! Xiaomi 17 Ultra షాకింగ్ ఫీచర్లు..! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! ఏపీ విద్యార్థులకు అదిరిపోయే వార్త... అమరావతిలో బిట్స్ పిలానీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! Microsoft: AI దెబ్బ.. మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్, ఒక్కరోజులో బిలియన్ల నష్టం! Smart Phone: ఇది ఫోన్ కాదు… చేతిలో పట్టుకునే DSLR! Xiaomi 17 Ultra షాకింగ్ ఫీచర్లు..! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! ఏపీ విద్యార్థులకు అదిరిపోయే వార్త... అమరావతిలో బిట్స్ పిలానీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!

AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!!

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త! 100% గ్రాస్ శాలరీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల వరకు అదనపు లాభం.

Published : 2026-01-31 10:05:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న ఒప్పంద (కాంట్రాక్ట్) ఉద్యోగుల పాలిట కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వేతన సమస్యకు స్వస్తి పలికి, సుమారు 1,560 మంది ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ శాలరీ (పూర్తి వేతనం) వర్తింపజేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రక నిర్ణయంతో ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున రూ. 10,000 వరకు అదనపు లబ్ధి చేకూరనుంది.

వెయ్యి మందికి పైగా లబ్ధి.. అరియర్స్ కూడా!

2001-2002 కాలంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో నియమితులైన 1,560 మంది ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో గతంలో నెలకొన్న వ్యత్యాసాలను ప్రభుత్వం తాజాగా సరిదిద్దింది. 2023 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి మధ్య కాలంలో టైమ్ స్కేల్ అమలు కారణంగా తగ్గిన వేతనాలను పరిగణనలోకి తీసుకుని, కోర్టు తీర్పుల నేపథ్యంలో వారందరికీ పూర్తి జీతం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం పెరిగిన జీతమే కాకుండా, గతంలో నిలిచిపోయిన సుమారు రూ. 16.45 కోట్ల బకాయిలను (అరియర్స్) కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ ఖజానాపై రూ. 21 కోట్ల అదనపు భారం

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే క్రమంలో ఏటా ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 21.51 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న పారామెడికల్ మరియు ఇతర సిబ్బందికి న్యాయం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఫైలుపై పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయం పట్ల ఏపీ పారామెడికల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సర్వీసెస్ అసోసియేషన్ (APPMSEWA) హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

లీవ్ ఊరట

వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ఏడాది డిసెంబర్ 9 నుండి 18 వరకు కార్మికులు చేపట్టిన సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా (లీవ్) పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సమ్మె కాలానికి సంబంధించి అధికారులు పెట్టిన కఠినమైన నిబంధనలను పక్కనపెట్టి, కార్మికుల విన్నపాన్ని మన్నించి ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం.

అటు తెలంగాణలోనూ శుభవార్త..

కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా,  తెలంగాణలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. మధ్యవర్తులు మరియు ఏజెన్సీల ప్రమేయం లేకుండా, వచ్చే ఏప్రిల్ నుంచి సుమారు 5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల కమీషన్ల బెడద తప్పి, ఉద్యోగులకు పూర్తి వేతనం చేతికి అందనుంది.
 

Spotlight

Read More →