Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Middle East War: ఇరాన్ దెబ్బకు కుప్పకూలిన అమెరికా 'ఈగిల్' యుద్ధ విమానం! Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Middle East War: ఇరాన్ దెబ్బకు కుప్పకూలిన అమెరికా 'ఈగిల్' యుద్ధ విమానం!

South Central Railway: ఏపీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ స్పెషల్ రైళ్లన్నీ రెగ్యులర్!

South Central Railway: ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లను (Special Trains) రెగ్యులర్ చేస్తూ రైల్వే శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి, సికింద్రాబాద్, అనకాపల్లి నరసాపురం మధ్య నడిచే రైళ్ల పూర్తి వివరాలు

Published : 2026-04-04 11:52:00

AP Railway News: ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న పలు సర్వీసులను ఇకపై శాశ్వత ప్రాతిపదికన 'రెగ్యులర్' రైళ్లుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రయాణికులకు టిక్కెట్ల లభ్యత పెరగడంతో పాటు, రైళ్ల రాకపోకల విషయంలో ఒక స్పష్టత లభించనుంది. ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, నరసాపురం వంటి కీలక నగరాల మధ్య ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది.

ఈ మార్పుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే కీలక రైళ్లకు మోక్షం లభించింది. సికింద్రాబాద్ - అనకాపల్లి (17043/17044) రైలుతో పాటు నరసాపురం - తిరుపతి (17427/17428) మధ్య నడిచే రైళ్లను క్రమబద్ధీకరించారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే అనకాపల్లి రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి నరసాపురం వెళ్లే రైలు నెల్లూరు, ఒంగోలు, తెనాలి వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతూ సామాన్య ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచనుంది.

మరోవైపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే మరికొన్ని రైళ్లను కూడా రైల్వే శాఖ క్రమబద్ధీకరించింది. చర్లపల్లి నుంచి అనకాపల్లికి నడిచే రైలు (17045/17046) ఇప్పుడు జనగాం, వరంగల్, ఖమ్మం, రాజమండ్రి మీదుగా రెగ్యులర్ సర్వీసుగా నడవనుంది. అలాగే కాకినాడ టౌన్ - లింగపల్లి మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఇకపై రెగ్యులర్ రైలుగా మార్చారు. ఈ నిర్ణయం వల్ల ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు సికింద్రాబాద్, హైదరాబాద్ వెళ్లడం మరింత సులభతరం కానుంది.

కేవలం రాష్ట్రం లోపలే కాకుండా, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రైళ్ల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు వెలువడ్డాయి. తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అకోలాకు వెళ్లే రైలు (17429/17430) ఇప్పుడు పూర్తిస్థాయి ఎక్స్‌ప్రెస్ రైలుగా మారింది. ఈ రైలు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణిస్తూ మహారాష్ట్రలోని కీలక పట్టణాలను కలుపుతుంది. దీనివల్ల ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తులకు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్లు దొరకడం సులభం అవుతుంది.

 తిరుపతి  చర్లపల్లి మధ్య నడిచే మరికొన్ని సర్వీసులను కూడా రైల్వే శాఖ రెగ్యులర్ జాబితాలో చేర్చింది. కడప, నంద్యాల, మార్కాపురం వంటి ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రైళ్లు రాయలసీమ, కోస్తా జిల్లాలను అనుసంధానిస్తున్నాయి. చర్లపల్లి - నరసాపురం మధ్య నడిచే సర్వీసులను కూడా క్రమబద్ధీకరించడంతో ప్రయాణికుల రద్దీని తగ్గించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ ప్రజలకు ప్రయాణ భారతాన్ని తగ్గించి, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించబోతోంది.

Spotlight

Read More →