వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత, 2024 ఎన్నికల ఓటమి అనంతరం బెంగళూరులోని తన నివాసంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. గతంలో వారం రోజులలో నాలుగు రోజులు తాడేపల్లికి వచ్చేవారు. కానీ ఈసారి ఆయన పూర్తిగా తాడేపల్లికి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ గత వారం తాడేపల్లిలో కనిపించకపోవడం వెనుక ఏదైనా serious issue ఉందా అనే ఉహాగానాలు మొదలయ్యాయి.
ఈ వేళ లిక్కర్ స్కామ్ కేసు తీవ్రత మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. మొదట్లో వైసీపీ దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు S.I.T దర్యాప్తుతో పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. జగన్ బెంగళూరులో తన సన్నిహితులతో strategy discussions నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కేసు మరింత లోతుల్లోకి వెళ్తే దాని ప్రభావం పార్టీపై ఎలా ఉంటుందన్న చర్చ కూడా వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.
ఒకవేళ ఈ కేసు సంబంధంగా అనుకోని పరిణామాలు జరిగితే, జగన్ అరెస్టు వంటి పరిస్థితి వస్తే, ప్రజల్లో ఎంతమేర సానుభూతి కలుగుతుందన్నది కూడా పార్టీ నేతలు గమనిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీకి విశ్వసనీయంగా వ్యూహాలు రచించే లీడర్లు లేనట్టు కనిపిస్తోంది. గతంలో విజయసాయిరెడ్డి ఢిల్లీలో బలమైన లాబీయింగ్ చేస్తూ పార్టీకి సహాయంగా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో నేతలు లేనందువల్ల, వైసీపీకి "ట్రబుల్ షూటర్" అవసరం మరింతగా కనిపిస్తుంది.