పెనమలూరు (కృష్ణా జిల్లా): మొంథా తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసినదే. కానీ కష్టకాలంలో ప్రజల పక్కన నిలబడడం తెలుగుదేశం పార్టీకి కొత్త విషయం కాదు. అదే తత్వాన్ని మరోసారి ఆచరణలో చూపిస్తూ కంకిపాడు మండలం మారేడుమాక గ్రామంలో టిడిపి కార్యకర్తలు మానవతా సేవలో ముందంజ వేశారు.
గ్రామ ప్రజలకు నిత్యవసర సరుకులు — బియ్యం, కూరగాయలు, కిరాణా సామగ్రి — స్వయంగా కొనుగోలు చేసి అందజేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిష్క్రియంగా ఉండకూడదనే సంకల్పంతో పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చోడవరపు ఆదర్శ్ మాజీ సర్పంచ్ ఊసల రామయ్య, వైస్ ప్రెసిడెంట్ ఎస్. మురళి, గ్రామ టిడిపి అధ్యక్షుడు వీర్ల వీరయ్య, వేమండ సురేష్ , జక్కుల జాను తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ చోడవరపు ఆదర్శ్ మాట్లాడుతూ..తుఫాను ఎంత పెద్దదైనా, టిడిపి పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారు. కష్టసమయంలో ముందుకు వచ్చి సహాయం చేయడం టిడిపి పార్టీ విలువలతో కూడినదని ఇది మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేర్పిన బాట అని అన్నారు.
మాజీ సర్పంచ్ ఊసల రామయ్య మాట్లాడుతూ, మొంథా తుఫాను వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని వేగంగా స్పందించింది. ప్రతి స్థాయిలో సమన్వయం సాధించడంలో లోకేష్ బాబు గారి మార్గదర్శకత కీలకంగా నిలిచింది ఆ నాయకత్వం వల్లే ఈరోజు గ్రామాల్లో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు.
గ్రామ ప్రజలు ఈ సహాయ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ టిడిపి కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
        