ఇది కూడా చదవండి: Second Airport: రెండో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్! అక్కడే ఫిక్స్!
మరో రెండు వారాల్లో అమెరికా (America) యూనివర్సిటీల్లో ఫాల్ సెమిస్టర్ (Fall Semester) మొదలు కానుంది. కానీ, వీసా (Visa) ఇంటర్వ్యూ (Interview) అపాయింట్‌మెంట్‌ల (Appointments) ఊసే లేకపోవడంతో భారతీయ విద్యార్థులు (Indian students) ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వీసా దరఖాస్తుల (Visa applications) తిరస్కరణలు కూడా పెరగడంతో ఈ సీజన్‌లో అమెరికాకు (USA) వెళ్లే భారతీయ స్టూడెంట్స్ (Indian students) సంఖ్య ఏకంగా 70 శాతం మేర తగ్గే అవకాశం ఉందని వీసా కన్సల్టెన్సీలు (Visa consultancies) అంచనా వేస్తున్నాయి.
కన్సల్టెన్సీలు (Consultancies) చెప్పే దాని ప్రకారం, సాధారణంగా భారతీయులు (Indians) ఈపాటికి వీసా ఇంటర్వ్యూలు (Visa interviews) పూర్తి చేసుకుని యూఎస్‌కు (US) వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైపోయింది. అనేక మంది ఇప్పటికీ వీసా స్లాట్ (Visa slot) కోసం రోజూ సంబంధిత వెబ్‌సైట్స్ (Websites) లో చెక్ చేస్తూ గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని కొందరు కన్సల్టెంట్లు (Consultants) వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Ap Highway: ఏపీలో ఆ కొత్త హైవే ఆరు లైన్లుగా..! రూ.8వేల కోట్లతో, గొల్లపూడి వరకు గ్రీన్‌సిగ్నల్..! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు..!
వీసా స్లాట్స్ (Visa slots) ను దశల వారీగా అందుబాటులోకి తెస్తామని అమెరికా అధికారులు (US officials) గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ స్లాట్స్ (Slots) అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు (Students) అయోమయంలో పడిపోతున్నారు. ఈ మధ్య కొన్ని స్లాట్స్ (Slots) అందుబాటులోకి వచ్చినా వాటిని బుక్ చేసుకున్న వారికి ఇంకా ధ్రువీకరణ (Confirmation) రాకపోవడంతో ఏం చేయాలో తెలీని స్థితిలో పడిపోయారు. కన్ఫర్మేషన్ (Confirmation) లేకుండా స్లాట్ బుకింగ్స్ (Slot bookings) కు అవకాశం ఇవ్వడంలో ఔచిత్యం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు తమ దరఖాస్తులను (Applications) కూడా ఉపసంహరించుకుంటున్నారు (Withdrawing).
తమకు వీసా స్లాట్ (Visa slot) కోసం వేచి చూసేంత సమయం లేదని చెబుతున్న కొందరు భారతీయ విద్యార్థులు (Indian students) జర్మనీ (Germany) లాంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లుతున్నారు. మరికొన్ని రోజుల్లో స్లాట్స్ (Slots) అందుబాటులోకి రాకపోతే అమెరికాకు (US) వెళ్లే వారి సంఖ్య ఏకంగా 70 శాతం మేర కోత పడొచ్చని కొందరు వీసా కన్సల్టెంట్లు (Visa consultants) చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ మరో 66 మంది లిస్ట్.. చైర్మన్ పదవుల్లో 50%కిపైగా మహిళలకే!
ఇక వీసా దరఖాస్తులు (Visa applications) తిరస్కరణకు గురవుతుండటం కూడా విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అన్ని అర్హతలు (Eligibility) ఉండి వీసా (Visa) దక్కాల్సిన వారికి కూడా చుక్కెదురవుతోంది. సోషల్ మీడియా అకౌంట్స్ (Social media accounts) లో ఎలాంటి అభ్యంతరకరమైన అంశాలు లేకపోయినా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటంతో అభ్యర్థులు (Applicants) ఆందోళన చెందుతున్నారు. చదువులు పూర్తయ్యాక భారత్‌కు తిరిగొస్తామనే నమ్మకాన్ని అభ్యర్థులు కలిగించలేకపోవడంతో తిరస్కరణలు ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!
Indian Railways: ప్లాట్‌ఫారమ్ చివర్లో జనరల్ బోగీలు! వెనుక ఉండటానికి కారణం ఇదే!
Payyavula Challenges: జగన్ కు పయ్యావుల సవాల్! హంద్రీనీవా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా!
High Court petition: మాజీ మంత్రికి హైకోర్టు భారీ షాక్.. పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం!
Ap Liquor sales: పెగ్గు మీద పెగ్గెయ్.. ఫుల్లు కిక్కు..! భారీగా పెరిగిన మద్యం విక్రయాలు!
OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: