లారీ డ్రైవరు ఉద్యోగం, ఎంతో కష్టపడి కొడుకును పై చదువుల కోసం అమెరికా పంపించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది అనుకునే సమయంలో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కొడుకును చూడాలని వెళ్ళిన తల్లి తిరగిరని లోకాలకు వెళ్ళిపోయింది.
విజయవాడ వాస్తవ్యులు అయిన తుమ్మల లక్ష్మి మరియు ఆమె భర్త తుమ్మల వెంకట వీర నాగేశ్వరరావు తమ కొడుకు చూసేందుకు అమెరికా వెళ్ళి జూలై 21, 2025న చికాగో నుండి ఢిల్లీ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం AI 126లో భారత్ కు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది. విమాన ప్రయాణం మధ్యలో లక్ష్మి గారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.
విమానం సిబ్బంది తక్షణం స్పందించారు. ప్రయాణికులలో ఉన్న వైద్యులు కూడా ముందుకొచ్చి అత్యవసర చికిత్స అందించారు. అయినా పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో, విమానం అత్యవసరంగా టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడం జరిగింది. వెంటనే ఆమెను అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కొన్ని వారాల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ, మృతితో పోరాటం సాగించిన లక్ష్మి గారు ఆగస్టు 24, 2025న తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వారి - కుటుంబానికి మాత్రమే కాకుండా, బంధుమిత్రులందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమ తల్లిని కోల్పోయిన ఆ బాధను వర్ణించలేనిది. విదేశీ నేలలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం కుటుంబానికి మరింత కష్ట సాధ్యమైందని ఆమె కొడుకు శోక సంద్రంలో మునిగిపోయాడు.
ప్రస్తుతం ఆ కుటుంబం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. తమ తల్లి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి, అలాగే ఆసుపత్రిలో చేసిన చికిత్స ఖర్చులను భరించడానికి చాలా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇస్తాంబుల్‌లోని వైద్య ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు, అలాగే మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి అవసరమయ్యే ఖర్చులు లక్షల్లో ఉండటంతో కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయింది.
భారతదేశానికి మృతదేహాన్ని తీసుకురావడం ఒక కఠినమైన ప్రక్రియ. అనుమతులు, పత్రాలు, దౌత్యపరమైన చర్యలు అన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలు మొత్తం అమెరికా నుండి తానా టీం స్క్వేర్ ప్రెసిడెంట్ కొత్తపల్లి కిరణ్ ఎంబసీ తో ఉత్తర ప్రతిట్టరాలు ఏపీఎన్నార్టీ తో పాటు ఎన్నారై టీడీపీ సెంట్రల్ ఆఫీసు నుండి చప్పిడి రాజ శేఖర్ సమన్వయం చేసుకుంటూ మృతదేహాన్ని అతిత్వరగా వారి స్వగృహానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రక్రియలు ఆ కుటుంబంపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి ఇప్పుడు సహాయం అత్యవసరం.
ఈ వార్త తెలిసిన వారు హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో అనుకోని సంఘటనలు ఎవరిని ఎప్పుడు దెబ్బతీస్తాయో చెప్పలేం. లక్ష్మి గారి మృతి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమెను కాపాడటానికి వైద్యులు ఎంతగానో ప్రయత్నించినా, చివరకు ప్రాణాలు నిలబడలేదు.
తుమ్మల కుటుంబం ఇప్పుడు ప్రజల సహకారం కోరుతోంది. “మా తల్లిని కోల్పోవడం మాకు తీరని దుఃఖం. ఇప్పుడు ఆమెను స్వదేశానికి తీసుకువెళ్ళి, అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాలని మా కోరిక. అయితే ఆసుపత్రి ఖర్చులు, ఇతర వ్యయాలు మేము భరించలేని స్థాయిలో ఉన్నాయి. మీరందరూ సహకరిస్తే అది మాకు ఎంతో ఉపశమనం అవుతుంది” అని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో సమాజం ముందుకు వచ్చి సహాయం చేస్తే, ఆ తల్లికి గౌరవప్రదమైన వీడ్కోలు చెప్పగలరు. ఇటువంటి సందర్భాల్లో వారికి చేయూతనివ్వడం, కష్టకాలంలో తోడుగా నిలవడం మన అందరి బాధ్యత.
విదేశాల్లో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎంత కష్టసాధ్యమో ఈ ఘటన మరోసారి మనందరికీ గుర్తు చేసింది. ఆ కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు చూసి, అందరూ తమవంతు సహాయం చేయాలని కోరుతున్నారు. సహాయం చేయాలి అనుకున్న వారు ఈ లింకు ను క్లిక్ ను క్లిక్ చేయండి