ఇది కూడా చదవండి: Hyderabad To Vizag: హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! 2 గంటలు తగ్గబోతున్న దూరం?
అమెరికా(America)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒహాయో రాష్ట్రంలో ఒక చిన్న విమానం(Flight) కూలిపోయిన ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ దుర్ఘటన సంభవించింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యంగ్స్‌టౌన్-వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుండి ఆదివారం(Sunday) ఉదయం ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన సెస్నా 441 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని వెస్టర్న్ రిజర్వ్ పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంతోనీ ట్రెవెనా ధ్రువీకరించారు. మృతదేహాలను ట్రంబుల్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా కష్టతరంగా ఉందని, అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని హౌలాండ్ టౌన్‌షిప్ అగ్నిమాపక విభాగం చీఫ్ రేమండ్ పేస్ వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Srisailam Project: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద! విద్యుత్తు ఉత్పత్తి...
BJP Nominated: ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు మొదలైన కసరత్తు! ఊహించని ఎంపిక.?
Gold Pricedrop: తొందరపడి బంగారం ఇప్పుడే కొనకండి.. ధరలు ఇంకా భారీగా తగ్గబోతున్నాయి! కారణం ఏంటంటే?
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: