‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని విదేశీ కవులు కీర్తించిన గొప్ప భాష మన తెలుగు. తెలుగు అభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం.
తెలుగు భాషా దినోత్సవం మన భాషా గౌరవాన్ని గుర్తు చేసే ప్రత్యేక రోజు. ఈ రోజు మనకు భాషా పరిరక్షణ, అభివృద్ధి పట్ల బాధ్యతను గుర్తు చేస్తుంది. తెలుగు సాహిత్యం, కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ వేడుకలు నిర్వహించబడతాయి. యువతలో తెలుగు భాషపై అవగాహన ..భవిష్యత్తు తరాలకు తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యం.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో, ప్రముఖ కవులు, సాహితీవేత్తల పేర్లతో కూడిన సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రతిబింబించేలా, ఒక కవి లేదా రచయితకు సంబంధించిన సాహిత్య సభలు, కచేరీలు, నాటకాలు, భరతనాట్యం, కవితా వేదికలు, శాస్త్రీయ సంగీతం వంటి విభిన్న రంగాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఈ రోజు వైజాగ్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రముఖులు పాల్గోని కళాకారులకు అవార్డులు అందజేయనున్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కింద పేర్కొన్న ప్రముఖ తెలుగు కవులు, రచయితలు, వారి రచనలు, ప్రావీణ్యం, వారు చెందిన ప్రదేశాలు ఇలా ఉన్నాయి:
శ్రీ నేలబోను సత్యం- తప్పెటగుళ్ళు జానపదం- శ్రీకాకుళం
శ్రీ పసుమర్తి శేషు బాబు- కూచిపూడి నాట్యం- కూచిపూడి
శ్రీ వల్లూరు సాంబశివ ప్రసాద్ - నాటక కళలు- గుంటూరు
శ్రీ యర్రాప్రగడ రామకృష్ణ- సాహిత్యం - రాజమండ్రి
శ్రీ పెరుగు రామ కృష్ణ- కవిత్వం- నెల్లూరు
శ్రీ చప్పిడి రాజశేఖర్ - సాంస్కృతిక సేవ- గుంటూరు
శ్రీమతి మండపాక శారద- శాస్త్రీయ సంగీతం- విశాఖపట్నం
శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ - సాహిత్యకవి- అవనిగడ్డ
ఆచార్య శ్రీ డి. మునిరత్నం నాయుడు- సాహిత్యం- చిత్తూరు
శ్రీచింతకిందిశ్రీనివాసరావు- రచయిత- విశాఖపట్టణం
శ్రీమాకినేనిసూర్యభాస్కర్- కళావిమర్శకులు- కాకినాడ
శ్రీదేవేంద్రపిళ్ళై-భరతనాట్యం- తిరుపతి
శ్రీపి.టి. మాధవ్- నాటకకళలు- విశాఖపట్టణం
శ్రీపల్లినల్లనయ్య- సాహిత్య కవి- శ్రీకాకుళం
కళాకారులందరికీ "ఆంధ్రప్రవాసి" తరఫున ప్రత్యేకంగా చప్పిడి రాజశేఖర్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.