Header Banner

గ్రూప్‌-1 స్కాంలో..! మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..!

  Tue May 27, 2025 12:28        Politics

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 (APPSC Group 1) మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసు (Answer Sheet Scam Case)లో మరో కీలక సూత్రధారి రఘు (Raghu) కోసం పోలీసులు (Police) గాలింపు చర్యలు చేపట్టారు. హాయ్‌ల్యాండ్‌ (Highland)లో ఏర్పాటు చేసిన మాన్యువల్ మూల్యాంకన శిబిరానికి ఎటువంటి అర్హత లేని దాదాపు 40 మందిని క్యామ్‌సైన్‌ సంస్థ తీసుకొచ్చిందని.. వారిలో కొందరి వివరాలు గల్లంతు కావడంపై అధికారులు మధును ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా విషయం దాటవేశారు. ఆ 40 మందిని తమ సంస్థలోని రఘు అనే ఉద్యోగి తీసుకొచ్చారని మధు తెలిపారు. దీంతో రఘు కోసం పోలీసులు పత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

కాగా గ్రూప్‌-1 అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను రెండో రోజు విచారించారు. అయితే విచారణలో పీఎస్‌ఆర్‌ దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఒక్క ప్రశ్నకూ ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ఎక్కడా తప్పు జరగలేదని, నిబంధనల మేరకే నడుచుకున్నానని చెప్పేందుకే ప్రయత్నించారు. పీఎస్‌ఆర్‌కు సోమవారం దాదాపు 25 ప్రశ్నలు సంధించగా పది ప్రశ్నలకు సమాధానమే ఇవ్వలేదని సమాచారం. ఈ కేసులో ఏ2గా ఉన్న మదుసూధన్‌ను కూడా పోలీసులు విచారించారు. సుమారు 14 ప్రశ్నలు అడిగి కీలకమైన విషయాలు రాబట్టినట్లు తెలియవచ్చింది. మాన్యువల్‌ మూల్యాంకనం చేయకుండానే చేశామని అనడం వెనుక ప్రధానంగా ఎవరున్నారు... ఏ1, ఏ2 మధ్య సంబంధం, పరిచయం తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు. మొదటి రోజు సరిగా సమాధానం చెప్పని ప్రశ్నలను రెండో రోజూ అడిగారు. దీంతో రెండు రోజుల కస్టడీ ముగియడంతో ఇద్దరినీ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. అక్కడి నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Group1Scam #APPSCScam #PoliceInvestigation #AnswerSheetScam #APNews #ScamAlert