ఇటలీలో ఓ చిన్నతరహా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బ్రెసియా నగర సమీపంలో ఉన్న హైవేపై అకస్మాత్తుగా కుప్పకూలిన ఈ విమానం మంటల పాలైంది. ప్రమాదంలో పైలట్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అల్ట్రాలైట్ క్యాటగిరీకి చెందిన ‘ఫ్రేషియా ఆర్జీ’ అనే ఈ విమానం, కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడినది. దాని వింగ్ వెడల్పు సుమారు 30 అడుగులు ఉంటుంది. ప్రమాదానికి ముందు, తగిన నియంత్రణ కోల్పోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతున్న సందర్భంలోనే విమానం ఒక్కసారిగా నోస్‌డైవ్ తీసుకుని రోడ్డును ఢీకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు.
విమానాన్ని ఢీకొనగానే భారీ పేలుడు సంభవించింది. రోడ్డుపై దూసుకొచ్చిన వేగవంతమైన విమానం మంటలు చెలరేగేలా చేసింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. పేలుడు సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు బైకర్లు గాయపడ్డారు.