Pawankalyan: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం! ఆ జిల్లాకు భారీ నిధుల విడుదల... ఆ ప్రాంతానికి మహర్దశ!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లుగా నియమితులైన 1,200 మందికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2002 జూలై 20న ప్రభుత్వం 2,324 ఎంపీహెచ్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలున్నాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు 2003 సెప్టెంబర్‌ 11న ఆ నియామకాలను రద్దు చేసింది. మెరిట్‌ జాబితాను తిరిగి సిద్ధం చేసి, కొత్త నియామకాలు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయినవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటివరకు సుప్రీంకోర్టు స్టేటస్‌కో విధించడంతో వారు 2011 వరకు విధుల్లో కొనసాగారు. కానీ చివరికి 2011 ఆగస్టు 9న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో 1,200 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.

Cyclone Alert: వాతావరణ శాఖ హెచ్చరిక! ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

తర్వాత ఈ ఉద్యోగులు తమ వయస్సు దాటిపోయిందని, మరోసారి పరీక్ష రాయడం సాధ్యం కాదని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మానవతా దృక్పథంతో స్పందించిన ప్రభుత్వం 2013 ఆగస్టు 19న జీవోఆర్టీ నంబర్‌ 1207 జారీ చేసింది. దానిలో భాగంగా ఉద్యోగ అనుభవం ఉన్న వారిని తిరిగి నియమించింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాలు తిరిగి వచ్చినా, దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. “2002 నోటిఫికేషన్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా తక్కువ మెరిట్‌ ఉన్నవారిని ఎందుకు తీసుకున్నారు?” అంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని, తక్కువ మార్కులు ఉన్నవారిని తొలగించాలని తీర్పు చెప్పింది.

ఇడ్లీ vs దోసె: షుగర్ పేషెంట్లకు ఏది బెస్ట్? ఎలా తీసుకోవాలి!

జీవో 1207 కింద నియమితులైన అభ్యర్థులు ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. “జీవో 1207 మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. వీరికి 11 ఏళ్ల సేవానుభవం ఉంది. వీరిని మళ్లీ నియమించడంలో ఎటువంటి తప్పు లేదు” అని ప్రభుత్వం పేర్కొంది. అలాగే 2002 పరీక్ష రాసిన ఇతరులు మళ్లీ ఉద్యోగాలు క్లెయిమ్‌ చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.

Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష! రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదన!

జస్టిస్‌ అరవింద్‌కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, తాజాగా ఆ 1,200 మంది నియామకాలను చెల్లుబాటుగా నిలిపింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్న వారికి పెద్ద ఊరట లభించింది. ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో దీర్ఘకాలంగా పరిష్కారం లేకుండా ఉన్న సమస్యకు ముగింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెల్త్‌ అసిస్టెంట్లు ఈ తీర్పును ఆనందంతో స్వాగతిస్తున్నారు.

Health Care: బరువు తగ్గాలని ఉందా? ఉదయం పూట ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కష్టమే!
SGB ఇన్వెస్టర్లకు ఆర్బీఐ గోల్డెన్ గిఫ్ట్..! ఐదేళ్లలోనే పెట్టుబడి విలువ మూడు రెట్లు..!
త్వరపడండి.. హోమ్ ఆఫీస్, స్టార్టప్‌లకు ది బెస్ట్! ఇకపై వై-ఫై రూటర్ కొనే పనిలేదు - అతి తక్కువ ధరలో.!
Cyclone Montha hits: కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. అధికారులు అలెర్ట్‌!
ఎండిన నిమ్మకాయల మ్యాజిక్.. వంటింట్లోని 6 సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. పారేస్తే నష్టమే!
Cyclone : తుపాన్ ప్రభావం తగ్గే వరకు రైళ్లు నిలిపివేత.. భద్రత కోసం ముందస్తు చర్యలు.. భువనేశ్వర్, విశాఖ, గుంటూరు రైళ్లు రద్దు!