పల్నాడు (Palnadu) జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న నరసరావుపేటలో ఇద్దరు రియల్టర్ల కిడ్నాప్, హత్య ఘటన చోటు చేసుకుంది. హత్యలకు సూత్రధారి వైకాపా(YCP) నేత బాదం మాధవరెడ్డి (Madhava Reddy)గా గుర్తించారు.
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిర్ధరణకు వచ్చారు. కిడ్నాప్, హత్యలో మాధవరావుతో పాటు మరో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. మాధవరెడ్డి గతంలో దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా పనిచేశారు. బెంగళూరుకు చెందిన కె.వీరాస్వామిరెడ్డి (62), అతని కుమారుడు కె. వి. ప్రసాదొడ్డి (37) ఇటీవల కోర్టు పనిమీద పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు.
ఈ నెల 23న ఉదయం నరసరావుపేట కోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో వాహనంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు.. తండ్రి, కుమారుడిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకెళ్లి ఇద్దరినీ హత్య చేసి పరారయ్యారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        