సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టును వీడతాడంటూ వస్తున్న వార్తలపై చివరకు స్పందించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌బై చెబుతాడని కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేసినా, వాటిని నితీశ్ తిప్పికొట్టాడు. ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించిన నితీశ్, "ఇలాంటి వదంతులను నమ్మవద్దు. ఎస్‌ఆర్‌హెచ్‌తో నా అనుబంధం విశ్వాసం, గౌరవంతో నిండి ఉంది. ఎప్పటికీ జట్టుకు అండగా ఉంటాను" అంటూ స్పష్టం చేశాడు.
2024 ఐపీఎల్ సీజన్‌లో నితీశ్ 303 పరుగులు చేసి తన ప్రతిభను చాటాడు. కానీ 2025లో గాయాల బారిన పడి కేవలం 182 పరుగులకే పరిమితమయ్యాడు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడన్న వార్తల మధ్య అతను జట్టును వదిలే అవకాశాలపై ఊహాగానాలు చెలరేగాయి.
ఇక ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న నితీశ్, ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొనలేకపోయాడు. అదే సమయంలో, టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ 'స్క్వేర్ ది వన్' దాఖలు చేసిన కేసుతో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రూ.5 కోట్లు బకాయిలు చెల్లించాలంటూ ఈ సంస్థ ఢిల్లీ హైకోర్టులో నితీశ్‌పై కేసు వేసింది. దీనిపై విచారణ సోమవారం జరగనుంది.