రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 6,238 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. మొదట ప్రకటించిన గడువు జులై 28తో ముగియాల్సి ఉండగా, అభ్యర్థులకు మరింత అవకాశం కల్పించేందుకు ఈ చర్య తీసుకుంది. జూన్ 28 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-1 సిగ్నల్ టెక్నీషియన్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్-3 కింద 6,055 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రిజర్వ్డ్ కేటగిరీలకు రూ.250 కాగా, ఇతరులకు రూ.500గా ఉంది. అర్హతగా సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణత అవసరం. ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం జీతభత్యాలు వర్తిస్తాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేయాలి.