అసలు ఎవరీ కొడవలు? తుపాకులు ఉంచుకునే హక్కు…
రష్మిక మందన వెనుక ఉన్న పవర్ ఫుల్ హిస్టరీ…
అసలు ఎవరీ కొడవలు..విందులో మందు, మాంసం రష్మిక మందన వివాహ విశేషాలు వైరల్..!!
కొడవ సంస్కృతి
విద్య సినీ అరంగేట్రం
కొడవ వివాహ పద్ధతి - 'మంగళ'
NationalCrush: కర్ణాటక చిత్ర పరిశ్రమలో కిరిక్ పార్టీ సినిమాతో ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన, నేడు లక్షలాది మంది గుండెల్లో నేషనల్ క్రష్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తనదైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ఈ భామ, ఒకప్పుడు కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేక ఇబ్బంది పడే స్థాయి నుండి, నేడు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. రష్మిక బాల్యం నుండి విజయ్ దేవరకొండతో వివాహం వరకు ఆమె జీవితంలోని విశేషాలను ఒక్కసారి చూద్దామా మరి...
కర్ణాటకలోని కొడగు జిల్లా, విరాజ్‌పేటలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో రష్మిక జన్మించారు. తండ్రి మదన్ మందన కాఫీ ఎస్టేట్ యజమాని కాగా, తల్లి సుమన్ గృహిణి. చిన్నతనంలో తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో, ఒక దశలో బొమ్మలు కూడా కొనలేని స్థితిని ఆమె చూశారు. కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో బోర్డింగ్ విద్యార్థిగా చదివిన రష్మిక, మొదట్లో చాలా సిగ్గుపడేవారట. కమ్యూనికేషన్ సరిగ్గా లేక ఇబ్బంది పడే ఆ అమ్మాయి, నేడు దేశం గర్వించే నటిగా ఎదగడం వెనుక పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉన్నాయి.
రష్మిక కొడవ అనే ప్రత్యేక తెగకు చెందినవారు. వీరిని కూర్గ్స్ అని కూడా పిలుస్తారు. వీరు హిందూ మతంలోని వివిధ సంప్రదాయాలను పాటిస్తూనే, ప్రకృతిని, ముఖ్యంగా కావేరి మాతను అమితంగా పూజిస్తారు. వీరు మాట్లాడే భాష 'కొడవ తక్'. చారిత్రక పరంగా వీరు యుద్ధ వీరులు కావడంతో, వీరి సంస్కృతిలో ఆయుధ పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం కూడా వీరికి లైసెన్స్ లేకుండా తుపాకులు ఉంచుకునే వెసులుబాటు కల్పించడం వీరి ప్రత్యేకతకు నిదర్శనం.
బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య కాలేజీలో సైకాలజీ, జర్నలిజం అభ్యసిస్తున్న సమయంలోనే రష్మిక మోడలింగ్ వైపు అడుగులు వేశారు. 2014లో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అవార్డు సాధించడంతో ఆమె దశ తిరిగింది. ఒక ప్రొఫెసర్ ప్రోత్సాహంతో 'కిర్రాక్ పార్టీ' సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి, తొలి ప్రయత్నంలోనే హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో కన్నడ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు.
మిగతా హిందూ వివాహాలతో పోలిస్తే కొడవ పెళ్లిళ్లు చాలా భిన్నంగా ఉంటాయి. వీరి పెళ్లిని 'మంగళ' అని పిలుస్తారు. ఇందులో పురోహితుడి అవసరం ఉండదు, పెద్దల సమక్షంలోనే అంతా జరుగుతుంది. పెళ్లి కొడుకు నలుపు రంగు కోటు (కుప్య), తలపాగా ధరించి, నడుముకు సంప్రదాయ కత్తి ధరిస్తారు. పెళ్లిలో భాగంగా అరటి చెట్లను నరకడం అనే ఆచారం వీరి వీరత్వానికి ప్రతీక. అలాగే వివాహ విందులో మద్యం, ముఖ్యంగా పంది మాంస ఉండటం వీరి సంప్రదాయంలో భాగం.
తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీత గోవిందం, పుష్ప సినిమాలతో గ్లోబల్ స్టార్‌గా మారారు. యానిమల్ సినిమాతో బాలీవుడ్ హృదయాలను కొల్లగొట్టి 'నేషనల్ క్రష్' అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. నటనలోనే కాకుండా మెక్‌డొనాల్డ్స్, ఓనిట్సుకా టైగర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు.
గతంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, రష్మిక తన కెరీర్‌ను ఎంతో హుందాగా మలుచుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఆమె వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అట్టహాసంగా జరిగింది. తన మూలాలను మర్చిపోకుండా, అటు తెలుగు సంప్రదాయం ప్రకారం, ఇటు తన సొంత కొడవ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె తన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ఒక సాధారణ అమ్మాయి నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన రష్మిక ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.