Header Banner

ముంబైలో కరోనా వైరస్.. ఇద్దరు మృతి.. భయాందోళనలో ప్రజలు!

  Tue May 20, 2025 15:35        India

ముంబైలో ఇద్దరు మహిళల మరణం తీవ్ర కలకలం రేపింది. వీరు కొవిడ్ కారణంగానే మృతి చెందారంటూ వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్పందించి, ఈ వార్తలను ఖండించింది. సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మరణించిన మాట వాస్తవమే అయినా, వారి మృతికి కరోనా కారణం కాదని బీఎంసీ స్పష్టం చేసింది. హైపోకాల్సెమిక్ మూర్ఛలతో పాటు నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్య కారణాలతోనే వారు మరణించారని అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

 

ఇది కూడా చదవండి: నిజాన్ని నిర్భయంగా చెప్పడం ప్రకాశం పంతులు నైజం! ఆయన జీవితం నేటి తరానికి..

 

ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్, తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ముంబైలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎంసీ సూచించింది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నగరంలో కొవిడ్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని, మే నెల నుంచి కొద్దిగా పెరుగుదల కనిపించిందని తెలిపారు. అయినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 20 ఐసీయూ పడకలు, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీల కోసం 20 పడకలు, 60 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ కోరింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CoronaVirus #XECVariant #Germany #Europe