బుధవారం ఉదయం రష్యా తీర ప్రాంతం పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కేలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కురిల్ దీవులు, జపాన్‌లోని హొక్కైడో ప్రాంతాన్ని సునామీ తాకింది. భారీ అలలు తీరాలను ముంచెత్తాయి. భూకంప తీవ్రతతో అనేక భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
ఈ భూకంప ప్రభావం పసిఫిక్ మహాసముద్రం మీదుగా వ్యాపించడంతో హవాయి, చిలీ, సోలెమన్ దీవులు, అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్ తీరాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అమెరికా పశ్చిమ తీరాల్లో ఉన్న భారతీయులకు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది. అత్యవసర సమయాల్లో సహాయ నంబర్లు వినియోగించుకోవాలనీ, ఫోన్‌లు ఛార్జ్ చేసుకోవాలని సూచించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రజలను ధైర్యంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్న సూచనలు చేశారు.