ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్‌లో భారీగా నగదు పట్టుబడింది. సిట్ దాడుల్లో 12 అట్టపెట్టల్లో దాచిన నగదును గుర్తించి సీజ్ చేసింది. ఈ నగదు రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు బాక్సుల్లో పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఈ సంఘటనతో మద్యం కుంభకోణంపై సిట్ దృష్టి మరింతగా కేంద్రీకరించింది.
ఈ కేసులో ఇప్పటికే రూ.3 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ అంచనా వేసింది. నగదు సీజ్ ఘటనకు సంబంధించి చాణక్య, వినయ్ ల పాత్రపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే మార కొంతమంది కీలక నేతల పాత్రపై కీలక ఆధారాలు ఏపీ సిట్‌కు లభ్యమయ్యాయి. అందులో కొందరు ప్రముఖులపై స్పష్టమైన ఆధారాలతో పెద్ద ఎత్తున చర్చలు చోటుచేసుకునే అవకాశముంది.