నగరంలోని కొండాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 11 మందిపై కేసు నమోదు చేశారు. 9 మందిని అరెస్టు చేయడంతో పాటు 6 కార్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సోదాల్లో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుప్గ్రేగ్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రుమ్, 1.91 గ్రాముల చెరాస్ డగ్స్ లభ్యమయ్యాయి. నిందితులను శేరిలింగపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడకు చెందిన వాసు, శివంరాయుడు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం వారు ఇతరుల గుర్తింపు కార్డులు వాడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        