ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరూ మక్కువ చూపిస్తున్నారు అదేవిధంగా పదో తరగతి పూర్తయిన వెంటనే నీట్ కోచింగ్ అని ఎంసెట్ కోచింగ్ అని ఇలా చిన్నపిల్లల మీద అధిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా అధిక మొత్తంలో ఖర్చు చేసి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతున్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో అధిక మొత్తంలో ఫీజులను వసూలు అధిక భారం వారి యొక్క మానసిక ఆరోగ్యంపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను పర్యవేక్షించడానికి, కొత్త నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా కోచింగ్ సెంటర్లలో విద్యార్థులకు భద్రత, న్యాయ పరిరక్షణ మరియు మానసిక ఆరోగ్యం కాపాడడం కోసం నిబంధనలు సిద్ధం చేస్తుంది. ఈ కమిటీని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ సభ్యులలో జాతీయ మెంటల్ హెల్త్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సైకాలజిస్ట్‌లు, సైక్రియాటిస్ట్‌లు మరియు విద్యార్థుల హక్కులను పరిరక్షించే పలు ఎన్‌జీఓలు కూడా ఉన్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యామండలి చైర్మన్, సాంకేతిక, ఇంటర్, పాఠశాల మరియు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్లు కూడా సభ్యులుగా ఉన్నారు. వీరు కలిసి విద్యార్థుల భద్రత, కోచింగ్ సెంటర్ల నాణ్యత, మరియు మానసిక ఆరోగ్యం అంశాలను పరిశీలిస్తారు.
సుప్రీం కోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో స్పష్టంగా సూచించింది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు సురక్షితంగా ఉండాలి. వారి మానసిక ఆరోగ్యం పరిరక్షించబడాలి.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది