Header Banner

విద్యార్థులకు సువర్ణావకాశం! జర్మనీలో నెలకు రూ.3 లక్షల జీతంతో ఉద్యోగాలు!

  Thu May 01, 2025 18:41        Employment

జర్మనీలో నర్సుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా చర్యలు చేపట్టింది. గుంటూరులో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, ఎంపికైన 22 మందికి జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా విమాన టికెట్లు, వీసా అందించి, నెలకు రూ.2.7 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు జీతం పొందే అవకాశం కల్పిస్తున్నారు. నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం.

 

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ యువతకు మంచి అవకాశం కల్పించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.. దీని కోసం ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. జర్మనీలో నర్సుల కొరత ఉంది.. జర్మనీలో వృద్ధుల సంరక్షణ కోసం నర్సుల కొరత ఉంది. అందుకే జర్మనీ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి నర్సులను నియమించుకోవడానికి ప్రయత్నిస్తోంది. చాలా మంది నర్సులు జర్మనీలో ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా ఏర్పాట్లు చేసింది.

 

ఇది కూడా చదవండి: వేయి కిలోల స్టీల్‌తో అమరావతి అక్షర రూపం! ఫైబర్‌‌గ్లాస్‌తో మోదీ విగ్రహం!

 

గతంలో, జర్మనీ వెళ్లాలంటే ఏం చేయాలో, ఎక్కడ శిక్షణ తీసుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి 22 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది డిసెంబర్ 11 నుండి శిక్షణ ప్రారంభమైంది.

 

ఈ శిక్షణలో జర్మన్ భాషలో A1, A2, B1, B2 స్థాయిలలో నైపుణ్యం సాధించాలి. ఇప్పటికే A1, A2, B1 పరీక్షలు పూర్తికాగా.. వారికి చెన్నైలో B2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మౌఖిక పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగానికి ఎంపకైనట్లు లెక్క.. అలా ఎంపికైనా వారికి విమాన టికెట్లు, వీసా, ధ్రువపత్రాలు అన్నీ ఉచితంగా అందిస్తారు. వీరికి నెలకు రూ.2.7 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు శాలరీ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని జర్మనీ పంపేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందని శిక్షణ తీసుకుంటున్నవారు చెబుతున్నారు. విదేశాల్లో నర్సులుగా ఉద్యోగాల కోసం వెళ్లేందుకు ఇది సువర్ణ అవకాశం అంటున్నారు.. ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #APSkillDevelopment #NursingJobsAbroad #GermanyNursesDemand #AndhraToGermany #FreeTrainingForNurses