టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) విశాఖపట్నంలో ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. విశాఖపట్నం పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సిటిజెన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఈ డ్రైవ్ 29 జూలై 2025 నుండి 8 ఆగస్టు 2025 వరకు జరుగుతుంది (ఆగస్టు 2వ తేది మరియు 3వ తేదీలను మినహాయించి). అభ్యర్థులు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బోట్చా స్క్వేర్, బిర్లా జంక్షన్, విశాఖపట్నం లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి హాజరయ్యే అవకాశం ఉంది.
అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల డేటా ప్రాసెసింగ్ లేదా డేటా ఎంట్రీ అనుభవం కలిగి ఉండాలి. అవసరమైన విద్యార్హతలు: BA, BBA, BBM, B.Com, B.Sc, BCA వంటి నాన్-టెక్నికల్ కోర్సులు మాత్రమే అంగీకరించబడతాయి.
BE, B.Tech, M.Tech, MCA వంటి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు అర్హులుకారు. అలాగే, ఇంగ్లిష్ మరియు తెలుగు భాషలలో మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండటం అవసరం.
ఇది కాకుండా, భీమవరం, కరీంనగర్ మరియు తిరుపతి వంటి ఇతర నగరాలలో కూడా ఇలాంటి వాక్-ఇన్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.