పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా భీమవరంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజలకు త్వరితగతిన లాభాలు అందేలా పీఎం సూర్యఘర్ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలి. బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రుణాల విషయంలో ఆటంకాలు లేకుండా చూడాలి. అదే విధంగా ఆర్డీఎస్ఎస్ పనులు కూడా నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని” ఆదేశించారు.
ప్రజల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంటూ, “కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై పూర్తి దృష్టి సారించింది. ప్రతి ప్రాజెక్టు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా ఉండాలి” అని మంత్రి తెలిపారు.