కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థ (DRDO) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (DIAT) పుణేలో పలు ఖాళీ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 31 అక్టోబర్ 2025 చివరి రోజు.
పోస్టులు & సంఖ్య
DIAT మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి. ముఖ్య పోస్టులు:
రీసెర్చ్ అసోసియేట్ (RA)
సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF)
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA)
ఈ ఉద్యోగాలు రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికతలపై కేంద్రీకృతమై ఉంటాయి. ఇక్కడ కృత్రిమ మేధస్సు (AI), మిసైల్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్స్, మిలిటరీ మెటీరియల్స్ వంటి పరిశోధనలు జరుగుతాయి.
అర్హతలు
RA: Ph.D. లేదా సమాన అర్హత
SRF/JRF :ME/M.Tech లేదా MSc, సంబంధిత విభాగంలో, GATE/NET ఉత్తీర్ణత తప్పనిసరి
PA: B.E/B.Tech, కనీసం ఫస్ట్ క్లాస్
ఎంపిక విధానం
అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జరగవచ్చు. ఎంపికైన అభ్యర్థులు DIAT పుణేలో ప్రాజెక్ట్ బేస్ రీసెర్చ్‌లో పని చేయనున్నారు.
జీతం వివరాలు
RA: ₹67,000 + HRA
SRF: ₹42,000 + HRA
JRF: ₹37,000 + HRA
PA : ₹25,000 (ప్రాజెక్ట్ ఆధారంగా మారవచ్చు)
వయస్సు పరిమితి
JRF/PA: 28 సంవత్సరాలు
SRF: 32 సంవత్సరాలు
RA: 35 సంవత్సరాలు
SC, ST, OBC, మహిళా అభ్యర్థులకు ప్రభుత్వం విధించిన రాయితీలు అందుతాయి.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు తమ అర్హత సర్టిఫికెట్లు, బయోడేటా, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఉన్నట్లయితే పరిశోధన పత్రాలను ఈమెయిల్ ద్వారా పంపాలి. పూర్తి వివరాలు DIAT అధికారిక వెబ్‌సైట్ https://www.diat.ac.in
https://www.diat.ac.in లో లభ్యమవుతాయి.
అసంపూర్ణ దరఖాస్తులు పరిగణించబడవు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకి తేదీలు ఇమెయిల్ ద్వారా తెలియజేయబడతాయి.
ఎంపికైన వారు DIAT లేదా DRDO అనుబంధ ల్యాబ్‌లలో ప్రాజెక్ట్ బేస్ రీసెర్చ్‌లో చేరతారు.