ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రధాన జాతీయ రహదారి విస్తరణకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం నుండి గుంటూరు వరకు సాగే 544D నేషనల్ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.4,200 కోట్లు విడుదలయ్యాయి.
ఈ హైవే ద్వారా రాయలసీమ ప్రాంతంలోని ఐదు ప్రధాన జిల్లాలకు అమరావతితో బలమైన కనెక్టివిటీ లభించనుంది. బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ మేర పనులు మొదటి ప్యాకేజీగా చేపడతారు. అనంతపురం జిల్లాలోనే 100 కి.మీ మేర హైవేను విస్తరిస్తారు. రెండవ ప్యాకేజీలో వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.80 కి.మీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల, బనగానపల్లి, గోస్పాడు, మహానంది మండలాల్లో bypass roads నిర్మించనున్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడనుంది.
హైవే పనులు పూర్తయితే అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు రాజధాని అమరావతికి మరింత వేగంగా చేరుకునే అవకాశం లభిస్తుంది. గతంలో నిధుల కొరత కారణంగా ఆలస్యం అయిన ఈ project, ఇప్పుడు వేగంగా పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు.