రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. షూటింగ్‌లో భాగంగా ఈరోజు జాన్వీ కపూర్ కొత్త లుక్ ఫోటోలు విడుదల చేశారు ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సినిమాలో జాన్వీ అచ్చియమ్మ పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్ రెండు విధాలుగా చూపించబడింది. మొదటి పోస్టర్‌లో ఆమె సంప్రదాయ గ్రామీణ దుస్తులు, ఆభరణాలతో జీప్‌పై నిలబడి జనసమూహానికి ధైర్యవంతంగా అభివాదం చేస్తున్నారు. ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం, ఈ లుక్ ద్వారా ఆమె పాత్రలో ఉన్న బలమైన స్వభావం ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది.
రెండవ పోస్టర్‌లో ఆమె మైక్ ముందు నిలబడి భయం లేకుండా మాట్లాడుతున్నట్లు చూపించారు. ఇక్కడ ఆమె ధైర్యం, నిర్ణయాత్మక వ్యక్తిత్వం మరింత ఆకట్టుకుంటోంది. ఈ రెండు పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
సినిమాను వృద్ది సినిమాస్ బ్యానర్‌లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సమర్పణ మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ద్వారా జరుగుతుంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం కోసం ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ ను తీసుకున్నారు.
నిర్మాతలు ప్రకటించిన ప్రకారం ఈ సినిమా మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టర్లు, జాన్వీ లుక్ విశేషాలు ఎక్కువ చర్చకు కారణమయ్యాయి. అభిమానులు సినిమాకు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి మాటలు తక్కువే.
ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫోటోలు చూస్తే, రామ్ చరణ్, జాన్వీ మాస్ లుక్‌లో అందరిని ఆకట్టే ఆకట్టుకున్నాయనే చెప్పుకోవాలి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ లుక్ ఆల్రెడీ హైట్ క్రియేట్ చేసేసాయనే చెప్పుకోవాలి.