Silver rates : అంతర్జాతీయ ప్రభావం.. దేశీయంగా వెండి రేట్లు ఎగిసిపడుతున్నాయి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ హీట్ పుంజుకుంటోంది. ప్రతి ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే డ్రామా, ఎమోషన్, గొడవలతో నిండిపోతోంది. ఇప్పటికే హౌస్‌ నుంచి పలువురు ఎలిమినేట్‌ కావడంతో ఆదివారం వైల్డ్ కార్డ్‌ ఎంట్రీలతో కొత్త కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు. ఈ సారి హౌస్‌లోకి ప్రవేశించిన వారిలో దివ్వెల మాధురి, అలేఖ్య, చిట్టి పికిల్స్‌ ఫేమ్‌ రమ్య మోక్ష, యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, టీవీ నటీనటులు నిఖిల్ నాయర్‌, ఆయేషా జీనత్‌, గౌరవ్ గుప్తా ఉన్నారు. వీరి ఎంట్రీతో హౌస్‌ వాతావరణం పూర్తిగా మారిపోయింది.

బంగారం ధరలకు రెక్కలు.. చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డు.. 10 గ్రాములు ఎంతంటే?

అయితే ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే దివ్వెల మాధురి హౌస్‌లో రచ్చ చేసి, చివరికి కన్నీళ్లు పెట్టుకోవడం హైలైట్‌గా మారింది. బిగ్ బాస్‌ నిర్వాహకులు విడుదల చేసిన తాజా ప్రోమోలో మాధురి, కళ్యాణ్‌, దివ్యల మధ్య ఘర్షణ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రోమోలో కళ్యాణ్ కిచెన్‌ దగ్గర ఉన్న మాధురిని పిలిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, ఆమె ‘ఏం కూర్చోకుంటే ఊరుకోరా?’ అంటూ వెటకారంగా స్పందించింది. దీనికి కళ్యాణ్‌ శాంతంగా రేపటి షెడ్యూల్‌ మారుస్తామని చెప్పినా, మాధురి కోపంతో స్పందిస్తూ “నేను ఇక్కడికి వచ్చి అరగంట అయ్యింది, అప్పుడే చెప్పొచ్చుగా” అంటూ ప్రతిగా ప్రశ్నించింది.

TIDCO Houses: టీడ్కో ఇళ్లు పొందిన వారికి కొత్త రూల్స్! ఇవి తప్పనిసరి.. లేదంటే ఇళ్లు రద్దు!

మాధురి ప్రవర్తనతో కళ్యాణ్‌తో పాటు దివ్య కూడా షాక్ అయ్యారు. పరిస్థితిని సర్దిచెప్పేందుకు దివ్య ప్రయత్నించినా, మాధురి మరింత ఆగ్రహంగా మాట్లాడింది. చివరికి హౌస్‌లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దాంతో మాధురి పక్కకు వెళ్లి ఏడుస్తూ కనిపించింది. ఇది చూసిన కళ్యాణ్‌ కూడా భరణి దగ్గర తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, “ఇప్పుడు ఏడిస్తే ఎలా?” అని అన్నాడు. ఈ సన్నివేశాలు ప్రోమో విడుదల కావడంతోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పెయిన్ కిల్లర్ కాదు.. గుండెకు కిల్లర్.. ఆ మాత్రతో తీవ్రమైన గుండె సమస్యలు వచ్చే ప్రమాదం!

దివ్వెల మాధురి బిగ్ బాస్‌ హౌస్‌లోకి రావడం ఒక వైపు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపితే, మరో వైపు ఆమె తొలి రోజు నుంచే చేసిన రచ్చ షోకు అదనపు మసాలాగా మారింది. ప్రేక్షకులు సోషల్ మీడియాలో “మాధురి డ్రామా మొదలైంది”, “ఎంట్రీ ఇచ్చి ఒక్క రోజులోనే రచ్చ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో హౌస్‌లో కొత్త సమీకరణాలు, కొత్త గొడవలు మొదలయ్యే అవకాశం ఉందని షో అభిమానులు అంటున్నారు. ఈ సీజన్‌ ఇప్పుడు నిజంగా రసవత్తర దశలోకి ప్రవేశించింది.

AC School: భారత విద్యా చరిత్రలో మైలురాయి..! రూ.5 కోట్లతో తొలి ఏసీ ప్రాథమిక పాఠశాల..!
IPhone 16: ఐఫోన్ 16 ప్రో పై రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్! ₹10,000 ఫ్లాట్ డిస్కౌంట్!
Tata Capital: టాటా క్యాపిటల్ భారీ అంచనాల మధ్య సాదాసీదా ఎంట్రీ..! పెట్టుబడిదారుల నిరాశ..!
మెర్సిడెస్ షోరూమ్ షాక్.. అప్పుల ఊబిలోకి యువత.. రెడిట్‌లో వైరల్ అయిన మెర్సిడెస్ బెంజ్ రహస్యం!
Allu Arjun: ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. ఇండస్ట్రీలో కొత్త మైలురాయి!
ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త.. కేవలం పొదుపు కాదు.. ఇకపై వ్యాపారవేత్తలు - ప్రభుత్వ మెగా ప్లాన్!