Header Banner

భారత్ పాక్ కు చావు దెబ్బ! అంతా అల్లకల్లోలం!

  Sat May 10, 2025 07:49        India

ఆపరేషన్ సింధూర్ -2 దెబ్బకు పాక్ విలవిల్లాడుతోంది. పాక్ లోని నగరాల పైన డ్రోన్ దాడులకు పాక్ తెగ బడుతోంది. భారత సైన్యం వాటిని నిర్వీర్యం చేస్తోంది. ఇదే సమయంలో జమ్ములోని పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు కొనసాగిస్తోంది. భారత్ లోని జనావాసాలు టార్గెట్ గా పాక్ చేస్తున్న కుట్రను భారత్ తిప్పి కట్టింది. పాక్ లోని నాలుగు ఏయిర్ బేస్ ల వద్ద పేలుళ్లు చోటు చేసుకోగా.. భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. వరుస పేలుళ్లతో పాక్ లో అల్ల కల్లోలం మొదలైంది. కాగా, ఇటు భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తం అయింది. అటు పాక్ గగనతలం మూసివేసింది.

 

అర్ద్రరాత్రి అల్లకల్లోలం
పాక్ లో అర్ద్రరాత్రి అల్ల కల్లోలంచోటు చేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, షోర్‌కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాల వద్ద జరిగిన పేలుళ్లతో పాక్ ఉలిక్కి పడింది. భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. కాసేపట్లో భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణల పైన స్పందించనుంది. కాగా, పాక్ తన గగన తలాన్ని మూసివేసింది. 10వ తేదీ మధ్యాహ్నం వరకు పూర్తిగా మూసివేసారు.

 

ఇది కూడా చదవండిబోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

వరుస పేలుళ్లు
పాక్ లోని లాహోర్ తో పాటుగా ప్రధాన ఏయిర్ బేస్ ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నట్లు కధనాలు వస్తున్నాయి. ఇక, పాక్ బాలిస్టిక్ క్షిపణని భారత్ కూల్చి వేసింది. హర్యానాలో పాక్ క్షిపణి ఫతాను భారత ఆర్మీ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. అటు జమ్ము సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగ బడింది. ఇటు శ్రీనగర్ వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. పాక్ డ్రోన్ దాడిని భారత్ తిప్పి కొట్టింది. భారత బలగాలు పాక్ కు ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. పాకిస్తాన్ నుండి నౌషేరాలో షెల్లింగ్ జరుగుతోంది. ఉధంపుర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పాక్‌ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్‌లోనూ డ్రోన్లతో పాక్‌ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

 

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #OperationSindhoor2 #IndiaStrikesBack #PakistanAirBase #DroneAttack #IndiaPakistanTensions #JammuKashmir #IndianArmy #PakViolations #AirStrike