భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష అయిన CAT 2025 (Common Admission Test) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సంవత్సరం పరీక్ష నిర్వహణ బాధ్యతను IIM కోజికోడ్ చేపట్టింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా IIMలు సహా ఇతర ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్‌లో MBA, PHD వంటి కోర్సులకు అడ్మిషన్ పొందవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు online లో దరఖాస్తు చేసుకునేందుకు iimcat.ac.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాల్సి ఉంటుంది. CAT అనేది జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షగా, ఇది విద్యార్థులకు మేనేజ్‌మెంట్ విద్యలో మంచి అవకాశాలను అందిస్తుంది. ఈ పరీక్షకు అప్లై చేయాలనుకునే వారు నోటిఫికేషన్‌లో ఉన్న అన్ని వివరాలను పరిశీలించి, నిర్ణీత గడువులోపు రిజిస్ట్రేషన్ పూర్తిచేయాల్సి ఉంటుంది.