ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ నాన్ ప్రొఫెషనల్ వర్కర్లకు ఆనందకరమైన వార్త చెప్పింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వేతనాల్లో పెంపు నిర్ణయం తీసుకుంది. కొత్త నిర్ణయం ప్రకారం కేటగిరీ వన్ వర్కర్ల నెల వేతనం 21,500 నుండి 24,500 రూపాయలకు పెంచారు. అలాగే కేటగిరీ టూ వర్కర్ల వేతనాన్ని 18,500 రూపాయల నుండి 21,500 రూపాయలకు పెంపు చేశారు.
ఇక కేటగిరీ త్రీ వర్కర్ల వేతనం 15,000 రూపాయల నుండి 18,500 రూపాయలకు పెరిగింది. గత కొంతకాలంగా వేతనాల్లో పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరట కలిగించింది. పెరిగిన వేతనాలు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. ఈ పెంపుతో వేలాది మందికి ఆర్థిక భరోసా లభించనుంది.