ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త Smart Ration Cards అందుబాటులోకి రాబోతున్నాయి. ఆగస్టు 25 నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కొత్త కార్డుల్లో కుటుంబ సభ్యుల ఫొటోలు మాత్రమే ఉంటాయని, నాయకుల ఫొటోలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆధునిక డిజైన్ తో, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సైజులో ఉండేలా ఈ కార్డులు తయారు చేయబడ్డాయి.
రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం QR Code ఆధారిత ట్రాన్సాక్షన్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానం వల్ల సెంట్రల్ ఆఫీసుకు డేటా తక్షణమే చేరుతుంది. ముఖ్యంగా వృద్ధులకు ఇంటికే సరుకులు డెలివరీ చేసే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 94 శాతం మంది లబ్ధిదారులకు e-KYC పూర్తయినట్టు మంత్రి పేర్కొన్నారు.
దీపం పథకం కింద కూడా మరో కీలక ప్రకటన వెలువడింది. మూడు ఆయిల్ కంపెనీలతో ప్రతి వారం సమీక్షలు జరుపుతూ, రెండో విడతలో లక్షలాది మందికి సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి డిజిటల్ వాలెట్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే కొంతమంది లబ్ధిదారులకు ఖాతా వివరాలు తప్పుగా ఉండటంతో డబ్బులు జమ కాకపోవడం జరిగినట్టు మంత్రి వివరించారు.
అంతేకాదు, అనర్హులుగా గుర్తించిన డెత్ కేసులను తొలగించి, వాలంటరీగా కార్డులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డు అన్ని సంక్షేమ పథకాలకూ ప్రాధమిక అర్హతగా పనిచేస్తుందని తెలిపారు. ఈ మార్పులతో రాష్ట్రంలో రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారనున్నది.