Caste Certificate: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు!

అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదలవుతుండగా, అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్నదాత సుఖీభవ’ నిధులూ రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇది ఏపీ రైతులకు ఒక పెద్ద ఊరట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు తొలి దశ నిధుల్ని విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు అందించనుంది. 

Actor Ponnambalam: ఒకప్పటి స్టార్ విలన్ ఇప్పుడు ఇంత దయనీయ స్థితిలో... 4 ఏళ్లలో 750 ఇంజెక్షన్లు!

మొత్తంగా ఒక్కరోజే రైతు ఖాతాలోకి రూ.7 వేలు నేరుగా డిపాజిట్ కానుంది. కేంద్రానికి సంబంధించిన కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరై నిధులు విడుదల చేస్తారు. ఈ విడతలో ఏపీకి రూ.831.60 కోట్లు పీఎం కిసాన్ నిధులు లభించనున్నాయి. వీటిని 41.58 లక్షల మంది రైతు కుటుంబాలకు జమ చేస్తారు. ఈ లెక్కన ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి రూ.2 వేలు చొప్పున అందుతుంది. టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా రైతులకు చేస్తున్న సహాయం ఇది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నదాత సుఖీభవ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. 

Free Education: ఏపీలో వారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు! ఇలా చేస్తే చాలు... పూర్తి వివరాలివే!

ఇప్పుడు తొలివిడతగా రూ.5 వేలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇది నేరుగా రైతు ఖాతాలోకి జమవుతుంది. మరిన్ని విడతలూ త్వరలోనే వస్తాయని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 46.64 లక్షల మంది రైతు కుటుంబాలను సుఖీభవకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేశారు. కేవలం 40,346 మంది రైతులు మాత్రమే ఇంకా ఈకేవైసీ చేయాల్సి ఉంది. వారూ త్వరలో పూర్తి చేస్తే వీళ్లకూ నిధులు అందుతాయి.

Praja Vedika: నేడు (29/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 ఇంకో ముఖ్యమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకూ పెట్టుబడి ఆర్ధిక సహకారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండో విడతలో నిధులు జమ చేస్తారు. ఆ సమయంలో వాళ్లకు మొదటి విడత + రెండో విడత కలిపి మొత్తంగా ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది.

AP Teachers: ఏపీలో టీచర్లకు భారీ ఊరట! ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ!
Deepika Padukone: దీపిక పదుకొనేకి అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే!
Heart Attack: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో వైద్యుడి మృతి!
Indirammas house: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త... ప్రభుత్వం నుంచి!
YCP Shock: మాజీ ఎమ్మెల్యేకి సీఐడీ నోటీసులు.. కీలక ఆధారాలు వెలుగులోకి.. గుంటూరు రాజకీయాల్లో కలకలం!
Walking: రోజుకు ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిది... నిపుణుల హెచ్చరిక!